![]() |
The funny moments of Heroin Kartik Aaryan and Sara Ali Khan |
The funny moments of Heroin Kartik Aaryan and Sara Ali Khan | హీరోయిన్ రొమాంటిక్ గొడవ వీడియో వైరల్
బాలీవుడ్ యంగ్ కపుల్ కార్తీక్ ఆర్యన్.. సారా అలీ ఖాన్ ల గురించి ప్రస్తుతం మీడియాలో తెగ పుకార్లు పుట్టుకు వస్తున్నాయి. వీరిద్దరి మద్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందని.. ఇద్దరి మద్య సినిమాకు మించిన సంబంధం ఇంకా ఏదో ఉందంటూ నెటిజన్స్ వారిపై కామెంట్స్ చేస్తున్నారు. లవ్ ఆజ్ కల్ చిత్రం షూటింగ్ సమయంలో వీరిద్దరి ఔటింగ్ లు... సినిమా ప్రమోషన్ అంటూ వీరిద్దరు చేస్తున్న రైడ్ లు బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.తాజాగా మరో వీడియో వీరిద్దరి మద్య సన్నిహిత సంబంధాన్ని చెప్పకనే చెబుతోంది. వ్ ఆజ్ కల్ ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ సభ్యులు టూర్ లో ఉన్నారు. ఆ సందర్బంగా ఒక చోట కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) కుర్రాడి తో ఫుట్ బాల్ ఆడుతూ ఉంటాడు. ఆ సమయంలో అటుగా సారా వెళ్లగా ఆ కుర్రాడు అన్న వదిన వచ్చింది అన్నాడు. ఆ కుర్రాడు వదిన అంటూ పిలవడం తో సారా షాక్ అయ్యి అతడి తో నువ్వే కదా అలా అనిపించింది అంటూ కార్తీక్ ఆర్యన్ ను చిలిపిగా కొట్టింది.
కార్తీక్ ఆర్యన్.. సారాల ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కార్తీక్ కావాలని అతడితో వదిన అని పిలిపించాడని.. ఇద్దరి మద్య వ్యవహారం దూరం వెళ్లిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తుంటే కొందరు మాత్రం ఇదంతా కూడా సినిమా పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టి పారేస్తున్నారు. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన లవ్ ఆజ్ కల్ సినిమా ప్రమోషన్ కోసం వీరిద్దరు తెగ హడావుడి చేశారు.. ఇంకా చేస్తూనే ఉన్నారు.
No comments:
Post a Comment