థియేటర్లు తెరవడంపై తెలుగు రాష్ట్రాల్లో అనిశ్చితి

 థియేటర్లు తెరవడంపై తెలుగు రాష్ట్రాల్లో అనిశ్చితి

Uncertainty-in-Telugu-states-over-opening-of-theaters-andhra-talkies
రాష్ట్రాలు థియేటర్లు తెరిచేందుకు మానసికంగా సిద్ధంగా ఉన్నాయా? లేవా? జనం థియేటర్లు తెరిస్తే సినిమాలు చూసేందుకు బయటకు వస్తారా రారా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. రేపటి నుంచి సస్పెన్స్ కి తెర దించేస్తారేమోనన్న చర్చ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటివరకూ అందిన సమాచారం మేరకు ఏపీలో రేపటి నుంచి థియేటర్లు తెరవరు. తెలంగాణలో తెరుస్తారా లేదా? అన్నదానిపై సమాచారం రాలేదు.


అన్ లాక్ 5.0 లో భాగంగా అక్టోబర్ 15 నుంచి దేశవ్యాప్తంగా సినిమా హాళ్లను తిరిగి తెరవడానికి కేంద్రం అనుమతించింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తిరిగి తెరవడంపై ఇంకా చాలా అనిశ్చితి నెలకొని ఉంది. ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుండి థియేటర్లు తెరుచుకోవడం లేదు. దీనిని థియేటర్ యాజమాన్యాలు అధికారికంగా ధృవీకరించనున్నాయట.

ఆంధ్ర ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ బుధవారం ఉదయం విజయవాడలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎగ్జిబిటర్స్ చీఫ్ కె.ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ... ``లాక్ డౌన్ కాలానికి విద్యుత్ బిల్లులను రద్దు చేస్తామని ఎపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు ఏమీ చేయలేదు. మా సమస్యలు పరిష్కరించేవరకూ థియేటర్లు తిరిగి తెరవడానికి అవకాశం లేదు`` అని తెలిపారు.

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టిఎఫ్సిసి) ప్రముఖుడు మాట్లాడుతూ ...``గత ఏడు నెలల్లో ఒకే థియేటర్ పై వసూలైన విద్యుత్ బిల్లు రూ .4 లక్షలు కాగా.... ఇప్పటి క్రైసిస్ పరిస్థితుల్లో థియేటర్ నడపడానికి మాకు రూ .10 లక్షలు ఖర్చవుతుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 500 థియేటర్లు తమ విద్యుత్ బిల్లులు చెల్లించలేదు. డబ్బు ఉన్నవారు .. థియేటర్లు కలిగి ఉన్నవారు.. వారి బిల్లులు చెల్లించారు. కానీ చెల్లించని వారు చాలా మంది ఉన్నారు. మా అభ్యర్ధనలను పరిగణనలోకి తీసుకొని బిల్లులను రద్దు చేయమని మేం ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. కనీసం ఇది మాకు ఉపశమనం ఇస్తుంది. మేము థియేటర్లను త్వరగా తెరవవచ్చు. ఆక్యుపెన్సీపై నిర్ణయం తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం`` అని అన్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...