ధనుష్ కు మంచి భార్యనవుతాః అమలా పాల్

Heroin-Amala-Paul-Crush-on-Dhanush-Andhra-Talkies
దర్శకుడు విజయ్ ను అమలా పాల్ ప్రేమించి పెళ్లి చేసుకోవడం తదనంతరం విడాకులు తీసుకోవడం తెలిసిన విషయమే. అయితే తనకు అవకాశమిస్తే మంచి భార్యనని నిరూపించుకుంటుందట. అందుకు హీరో ధనుష్ అవకాశమిస్తే బాగుంటుందని తన మనసులో మాట బయటపెట్టిందీ అమ్మడు. చక్కగా కాపురం చేసుకుంటున్న ధనుష్ను అమలా పాల్ పెళ్లి చేసుకోవడం ఏమిటి? అనుకుంటున్నారా?

ఏమీ లేదండీ - త్వరలో విడుదల కాబోతున్న వీఐపీ-2లో ధనుష్ భార్యగా అమలాపాల్ నటిస్తోంది. గతంలో వచ్చిన వేలై ఇల్లా పట్టాదారి(వీఐపీ- తెలుగులో రఘువరన్.బీటెక్) సినిమాలో వీళ్లిద్దరి కెమెస్ట్రీ అద్భుతంగా పండటంతో రెండో భాగానికి కూడా అమలానే ఎంపికచేసుకున్నారు. ఒకవేళ వీఐపీ-3 నిర్మిస్తే అందులో ధనుష్ కు మంచి భార్యగా ఉంటా అని చమత్కరించింది అమలాపాల్. ఈ రకంగా ఇంకా వస్తుందోరాదో తెలియని సినిమాలో తన పాత్రను కన్ఫార్మ్చేసుకుందీ ముద్దుగుమ్మ!

వీఐపీ-1లో హీరో ధనుష్ ని ఆటపట్టించి ఏడిపించే ప్రియురాలిగా అమలాపాల్ నటించింది. వీఐపీ-2లో హీరో భార్యగా చేస్తోంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడినపుడు పై వ్యాఖ్యలు చేసింది. ''వీఐపీ-1లో నా పాత్రను చంపేయనందుకు థ్యాంక్స్. వీఐపీ-2లో సతాయించే భార్యగా నటిస్తున్నా. ఫస్ట్ పార్ట్ లో ప్రియురాలిగా సెకండ్ పార్ట్ లో హింసించే అర్ధాంగిగా చేశాను. అవకాశం వస్తే వీఐపీ-3లో కచ్చితంగా ధనుష్ కు మంచి భార్యగా నటిస్తా'' అంటూ తన మనసులో మాటను బయటపెట్టింది అమలా పాల్.
Heroin-Amala-Paul-Crush-on-Dhanush-Andhra-Talkies...Read More

కేసులు పెట్టడానికి చంద్రబాబు ఎవరి కాళ్లలయినా పట్టేసుకుంటాడు.- రోజా సంచలన వ్యాఖ్యలు

ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో YCP MLA రోజా మునుపటి మాదిరిగా రెచ్చిపోయింది. చంద్రబాబును, అతని తనయుడు లోకేష్ ను తిడుతూ అనేక రకాలుగా విరుచుకు పడిపోయింది. కేసులు పెట్టడానికి చంద్రబాబు ఎవరి కాళ్లలయినా పట్టేసుకుంటాడని, అతని కొడుకుకి ఏమీ రాని దద్దమ్మ అంటూ తిట్టిపోసింది. ఆమె నోటి దురుసు మాటి.మాటికీ పెరుగుతూ ఉంటుంటే TDP పార్టీ వాళ్ళు ఎందుకు మిన్నకుండి పోతున్నారో ఆంధ్రా ప్రజలకు అర్ధమై చావడం లేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు...Read More
Chandrababu takes anybody's legs to get the cases. Rosa sensational comments

'దువ్వాడ జగన్నాథం' మూవీ రివ్యూ

Duvvada-Jagannadham-Movie-Review-Andhra-Talkies
చిత్రం : ‘దువ్వాడ జగన్నాథం’ 

నటీనటుల: అల్లు అర్జున్ - పూజా హెగ్డే - రావు రమేష్ - మురళీ శర్మ - సుబ్బరాజు - పోసాని కృష్ణమురళి - తనికెళ్ల భరణి - చంద్రమోహన్ - వెన్నెల కిషోర్ - శశాంక్ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: అయానంక బోస్
స్క్రీన్ ప్లే: రమేష్ రెడ్డి - దీపక్ రాజు
నిర్మాత: దిల్ రాజు
కథ - మాటలు - దర్శకత్వం: హరీష్ శంకర్

హీరో అల్లు అర్జున్.. దర్శకుడు హరీష్ శంకర్.. నిర్మాత దిల్ రాజుల క్రేజీ కాంబినేషన్లో  తెరకెక్కిన సినిమా ‘దువ్వాడ జగన్నాథం’. మొదలైన నాటి నుంచి ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాల్ని ఏమేరకు అందుకుందో చూద్దాం పదండి.

కథ: 
చిన్నతనం నుంచే అన్యాయం అంటే సహించని బ్రాహ్మణ కుర్రాడు దువ్వాడ జగన్నాథం అలియాస్ డీజే (అల్లు అర్జున్). ఓవైపు తండ్రితో కలిసి క్యాటరింగ్ నడుపుతూనే.. మరోవైపు ఒక పోలీస్ సహకారంతో అక్రమార్కుల భరతం పడుతుంటాడు. తన ఐడెంటిటీ తెలియకుండా డీజే పనులు చక్కబెడుతున్న సమయంలో ఒక భారీ కుంభకోణం బయటికి వస్తుంది. దాని వల్ల తన ఆత్మీయుడు చనిపోవడంతో డీజే రంగంలోకి దిగుతాడు. ఈ కుంభకోణం వెనుక ఉన్న రొయ్యల నాయుడు (రావు రమేష్).. డీజే మీద దృష్టిసారిస్తాడు. తన డొంక కదిలిస్తున్న డీజే గుట్టు మొత్తం తెలుసుకుని అతడి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెడతాడు రొయ్యల నాయుడు. మరి డీజే.. అతణ్ని ఎలా ఎదుర్కొన్నాడు.. తన మిషన్ ఎలా కొనసాగించాడు.. ఈ కుంభకోణం వల్ల బాధితులైన కుటుంబాల్ని ఎలా ఆదుకున్నాడు.. అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ: 
హీరో అరంగేట్రాన్ని చిన్నతనం నుంచి చూపిస్తూ అక్కడి నుంచే హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం తెలుగు సినిమాల్లో మామూలే. ‘దువ్వాడ జగన్నాథం’లో కూడా హరీష్ శంకర్ కథను అలాగే మొదలుపెట్టాడు. కాలేజీలో తన అక్కయ్యను అల్లరి పెడుతున్న కుర్రాళ్ల మీదికి పది పన్నెండేళ్ల వయసున్న చిన్న పిల్లాడు దూసుకెళ్తాడు. వాళ్లను ఉతికారేసేస్తాడు. పిల్లాడేంటి.. అంత పెద్దోళ్లను కొట్టేయడమేంటి అనిపించినా.. కమర్షియల్ సినిమాల్లో ఈమాత్రం హీరోయిజం అర్థం చేసుకోదగ్గదే అని సర్దుకుపోవచ్చు. కానీ ఆ పిల్లాడు అంతటితో ఆగడు. మార్కెట్లో ఓ పోలీసోడిని రౌడీ గ్యాంగ్ చంపేయబోతుంటే.. తనే గన్ను తీసుకుని ఆ బ్యాచ్ మొత్తాన్ని టపాటపా కాల్చి అవతల పారేస్తాడు. అంతటితో ఆగినా బావుణ్ను. ఆ తర్వాత పోలీస్ స్టేషనుకెళ్తే అక్కడ ఓ రౌడీని చూసి ఊగిపోయి మళ్లీ గన్ను తీసి ఠపీమని కాల్చేస్తాడు.

పోలీసోడికి పిల్లాడిలో ఉన్న ఫైర్ నచ్చేస్తుంది. అతడితో చెయ్యి కలిపేస్తాడు. తన దగ్గరికి వచ్చే కంప్లైంట్లన్నింటినీ ఈ పిల్లాడికి ఫార్వర్డ్ చేస్తాడు. అతనెళ్లి రౌడీలు.. గూండాల భరతం పట్టేస్తూ ఉంటాడు. అవతలున్నది ఎంతటి బిగ్ షాట్ అయినా సరే.. దువ్వాడ జగన్నాథం దగ్గరికి కంప్లైంట్ వచ్చిందంటే అతను డీజే అవతారంలోకి వచ్చేసి మ్యాటర్ ముగించేస్తాడంతే. ఇక్కడ పరిచయ సన్నివేశంలో హీరోను కనీసం నూనూగు మీసాల కుర్రాడిగా అయినా చూపిస్తే కాస్తయినా వాస్తవికంగా అనిపించునేమో. కానీ ఓ చిన్న పిల్లాడు అలా హత్యలు చేయడం.. అతడితో పోలీస్ మిషన్ మొదలుపెట్టడమే విడ్డూరంగా అనిపిస్తుంది. అప్పుడే అనిపిస్తుంది.. ఇలాంటి సన్నివేశాలతో సభ్య సమాజానికి దర్శకుడు హరీష్ శంకర్ ఏం మెసేజ్ ఇద్దామనుకున్నాడా అని. తొలి సన్నివేశంతోనే దారి తప్పిపోయిన ‘డీజే’. తర్వాత కూడా ఎక్కడా సరైన దారిలో సాగుతున్నట్లుగా అనిపించడు. కమర్షియల్ సినిమాలంటే ఏం చేసినా చెల్లిపోతుంది అనే ‘పాత’ ఆలోచనతో హరీష్ శంకర్ తీసిన రొటీన్ సినిమా ‘డీజే’.

రొటీన్ అనిపించినా ఎంటర్టైన్మెంట్ తో మ్యాజిక్ చేసి  పైసా వసూల్ అనిపించే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘డీజే’ ట్రైలర్ పోస్టర్ చూస్తే.. ఇది ఆ కోవలోని సినిమాలాగే అనిపించింది. అల్లు అర్జున్ బ్రాహ్మణ కుర్రాడి పాత్ర భలేగా ఎంటర్టైన్ చేసేస్తుందని.. ఆ మాయలో కథ ఎంత రొటీన్ గా ఉన్నా చెల్లిపోతుందని అనుకున్నారు అందరూ. కానీ ‘అదుర్స్’ సినిమాను చారి పాత్ర నిలబెట్టినట్లుగా.. ‘డీజే’కు బ్రాహ్మణ కుర్రాడి పాత్ర బలం కాలేకపోయింది. ప్రోమోల్లో మెరిసినట్లుగా సినిమాలో మెరవలేకపోయింది ఈ పాత్ర. ఆరంభ మెరుపులు తప్పితే.. ఈ పాత్రలో విషయం లేదు. రెండు మూడు సన్నివేశాలకే ఈ క్యారెక్టర్ తేలిపోతుంది. ఇందులో ఏ ప్రత్యేకతా లేదనిపిస్తుంది. దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు పెద్దగా వినోదాన్ని పంచకపోవడంతో కాసేపటికే ‘డీజే’ బోర్ కొట్టించడం మొదలుపెడతాడు.

ఏ కొత్తదనం లేని ఈ కథనంలో రొమాన్స్ కూడా ఆసక్తి రేకెత్తించదు. పొగరుబోతు హీరోయిన్... హీరోతో సయ్యాటలాడి అతడిని ముగ్గులోకి దించడం.. తర్వాత అతణ్ని అవమానించి వెళ్లిపోవడం.. తర్వాత హీరో మీద ఆమెకు కలవరం పుట్టడం.. ఇలా 90ల నాటి రొమాంటిక్ ట్రాక్స్ ను గుర్తుకు తెస్తుంది ‘డీజే’లో లవ్ స్టోరీ. ఇద్దరి మధ్య ప్రేమ పుట్టే సరైన సీన్ కూడా చూపించకుండా.. హోం మంత్రి కూతురు వంటవాడైన హీరో కోసం వెతుక్కుంటూ వచ్చేయడం మరీ విడ్డూరంగా అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ ను సైతం దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేదు. హీరో హీరోయిన్ల పాత్రలు తేలిపోయాక ఇక రొయ్యల నాయుడిగా రావు రమేష్ క్యారెక్టర్ మీద ఆశలు పెట్టుకుంటాం. కానీ ఆ పాత్రదీ ఆరంభ శూరత్వమే అయింది. ఎంటర్టైన్మెంట్ మీద ఆశలు పోవడంతో ఇక యాక్షన్ మీద.. కథ మీద ఫోకస్ పెడతాం. అవి మరింతగా నిరాశకు గురి చేస్తాయి. అక్కడక్కడా కొన్ని కామెడీ మెరుపులు.. పూజా హెగ్డే గ్లామర్.. పాటలతో ప్రథమార్ధమైనా ఓ మాదిరిగా అనిపిస్తుంది కానీ.. ద్వితీయార్ధమైతే ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది.

అగ్రి గోల్డ్ కుంభకోణం నేపథ్యంలో కథను అల్లుకోవడం కంటెంపరరీగా అనిపించొచ్చు కానీ.. ఆ పాయింట్ మినహాయిస్తే ఇంకేదీ ప్రస్తుత కాలానికి తగ్గట్లుగా అనిపించదు. రావు రమేష్ ది ముందు సహాయ పాత్రలా అనుకుంటాం కానీ.. అతడిదే లీడ్ విలన్ రోల్ అని తెలియడానికి చాలా సమయం పట్టేస్తుంది. హీరో-విలన్ డైరెక్ట్ వార్ మొదలయ్యే సమయానికి పుణ్యకాలం గడిచిపోతుంది. ఇంకా సినిమా అయిపోలేదా అన్న ఫీలింగ్ కలుగుతన్న సమయంలో అబుదాబి నేపథ్యంలో సా...గే ప్రి క్లైమాక్స్ ‘డీజే’ వాయింపుడుకు పరాకాష్ట. అందులో ఓ సన్నివేశంలో సుబ్బరాజు క్యారెక్టర్.. నువ్వు నన్ను పిచ్చోడిని చేద్దామనుకుంటున్నావా అంటూ ఆవేశపడతాడు. ఈ ఎపిసోడ్.. ఆ తర్వాత వచ్చే ‘సర్ప్రైజింగ్’ క్లైమాక్స్ చూశాక ప్రేక్షకుల ఫీలింగ్ కూడా దాదాపుగా ఇలాగే ఉంటుంది. హరీష్ అన్నట్లుగా నిజంగా ఇలాంటి క్లైమాక్సును ప్రేక్షకులు ఊహించి ఉండరు. రెండున్నర గంటలకు పైగా నిడివి ఉండటం కూడా ‘డీజే’కు పెద్ద మైనస్. సినిమా అంతా అయ్యాక కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండే అల్లు అర్జున్.. దిల్ రాజు ఈ కథకు ఎలా ఓటేశారన్న సందేహం కలుగుతుంది. ఐతే బన్నీ ‘బద్రీనాథ్’ చేసిన సంగతి.. ఇదే హరీష్ శంకర్ తో దిల్ రాజు ‘రామయ్యా వస్తావయ్యా’ తీసిన విషయం గుర్తుతెచ్చుకుంటాం!

నటీనటులు: 
అల్లు అర్జున్ నటన ఓకే అనిపిస్తుంది. బ్రాహ్మణ కుర్రాడి పాత్రలో తనవంతుగా ఏదో చేశాడు కానీ.. ‘ముగ్గురు మొనగాళ్లు’లో చిరంజీవి.. అదుర్స్’లో ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ తో పోలిస్తే ఇది సోసో. ఈ పాత్ర వాటిలా అంత ఎంటర్టైనింగ్ గా లేదు. బన్నీ లుక్ మాత్రం బాగుంది. రెండు అవతారాల్లోనూ ఆకట్టుకున్నాడు. అతడి డ్యాన్సులు.. ఫైట్ల గురించి చెప్పేదేముంది. ఎప్పట్లాగే బాగా చేశాడు. పూజా హెగ్డే సినిమాలో చెప్పుకోదగ్గ ఆకర్షణల్లో ఒకటి. ఆమెలోని గ్లామర్ యాంగిల్ ను హరీష్ బాగా ఎలివేట్ చేశాడు. తెలుగులో ఇంతకుముందు చేసిన రెండు సినిమాలతో పోలిస్తే చాలా భిన్నంగా కనిపించింది పూజ. అందాల ప్రదర్శనలో ఏమాత్రం మొహమాటం చూపించకుండా రెచ్చిపోయింది. అందంగా.. సెక్సీగా కనిపించిన పూజ నటన పరంగా పెద్దగా చేసిందేమీ లేదు. రావు రమేష్ కొన్ని సన్నివేశాల్లో తనదైన శైలిలో అలరించాడు కానీ.. లీడ్ విలన్ రోల్ కు ఆయన సరిపోలేదు. మురళీ శర్మ పాత్ర.. నటన మామూలే. ఈ మధ్య కామెడీలో మాంచి రైజింగ్ లో ఉన్న వెన్నెల కిషోర్ ను ఇందులో సరిగా వాడుకోలేదు. పోసాని.. భరణి.. చంద్రమోహన్.. వీళ్లంతా మామూలే. నటీనటులు చాలామంది ఉన్నా.. చాలామంది ప్రేక్షక పాత్రకు పరిమితం అయ్యారు.

సాంకేతికవర్గం: 
దేవిశ్రీ ప్రసాద్ ఓ కమర్షియల్ సినిమాకు సరిపోయే ఊపున్న మ్యూజిక్ ఇచ్చాడు. అస్మైక యోగ తస్మైక భోగ.. వీనుల విందే కాదు.. కనువిందు కూడా. మిగతా పాటలు మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఊపుతో సాగుతాయి. అయానంక బోస్ ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ రిచ్ గా అనిపిస్తాయి. దిల్ రాజు సినిమా.. పైగా ఆయన బేనర్లో 25వది.. కాబట్టి నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎటొచ్చీ కథాకథనాలే తేడా కొట్టేశాయి. తాను ప్రేక్షకుల అంచనాలకు అందనని హరీష్ శంకర్ మరోసారి రుజువు చేశాడు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత కెరీర్ కు అత్యంత కీలకమైన పెద్ద అవకాశాన్ని అతను వృథా చేసుకున్నాడు. రొటీన్ కథను ఎంచుకోవడంతోనే నిరాశ పరిచిన హరీష్.. ఇక కథనం విషయంలోనూ ఏ ప్రత్యేకతను చూపించలేకపోయాడు. రైటర్ గా తన మీద పెట్టుకున్న ఆశల్ని అతను నీరుగార్చేశాడు. అక్కడక్కడా కొన్ని డైలాగులేవో పేలాయి కానీ.. ఓవరాల్ గా హరీష్ మార్కు వేగం.. ఎంటర్టైన్మెంట్ ఇందులో మిస్సయింది.
చివరగా: డీజే.. బోరో బోరస్య బోరభ్యహ..

సెక్సీ లుక్స్ తో స్వరాలాపన మొదలుపెట్టిన నర్గీస్ ఫక్రీ

Nargis-Fakhri-Tunrs-As-Singer-Andhra-Talkies
అమెరికన్ లేడీ నర్గీస్ ఫక్రీ ఇండియన్ మూవీస్ ఇరగదీసేస్తూ ఉంటుంది. అక్కడ మోడలింగ్ తో మొదలుపెట్టిన నర్గీస్.. ఇండియాలో రాక్ స్టాక్ మూవీతో అరంగేట్రం చేసి.. వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. అయితే.. ఈ భామకు పాటలు పాడ్డం అంటే మహా ఇష్టమట. ఒకటి అవకాశం రాకపోవడం.. రెండు తనకు తానుగా పాడేందుకు ధైర్యం చేయకపోవడంతో.. ఇప్పటివరకూ తన స్వరాన్ని జనాలకు వినిపించని నర్గీస్.. ఇప్పుడు మ్యూజిక్ వీడియోతో ప్రేక్షకులను పలకరించబోతోంది.

సెక్సీ బ్యూటీగా విపరీతమైన గుర్తింపు ఉన్న ఈ భామ.. ఇప్పుడు సింగర్ అవతారం ఎత్తేస్తోంది. పంజాబీ సింగర్ పరిచయ్.. కెనడియన్ ర్యాపర్ కార్డినాల్ అఫిషాల్ తో కలిసి పాటేసుకుంటోంది ఈ బ్యూటీ. మ్యూజిక్ వీడియో కావడంతో.. ఈ సింగిల్ లో తన లుక్స్ ఎలా ఉంటాయో చూపించేసింది నర్గీస్ ఫక్రీ. డెనిమ్ జీన్స్ ప్యాంట్.. బటన్స్ జీన్స్ టాప్ లో కనిపించనున్న నర్గీస్.. ట్రాన్స్ పరెంట్ డిజైనర్ వేర్ లోంచి తన షోకులను కూడా ప్రదర్శించేస్తోంది. బోర్డర్లు డిసైడ్ చేసేసిన డిజైనర్ డ్రెస్సులో క్లీవేజ్ షో... ట్రాన్స్ పరెంట్ వేర్ లోంచి నాభి షోకులు చూపించడం.. ఇలాంటి ట్రిక్కులన్నీ బాగానే అప్లై చేసింది నర్గీస్.

అయితే.. తను పాట పాడ్డం అనే అంశంపై విమర్శలకు ముందుగానే ప్రిపేర్ అయిపోయినట్లు చెబుతోందీ భామ. వెస్ట్రన్ మ్యూజిక్ కి.. ఇక్కడి సంగీతాన్ని మిక్స్ చేసినట్లుగా ఈ పాట ఉంటుందిట. ఇటు అందాలు కుమ్మరిస్తూ.. అటు తన స్వరాన్ని వినిపించే నర్గీస్ ఫక్రీ.. త్వరలోనే ఈ మ్యూజిక్ సింగిల్ తో మన ముందుకు వచ్చేయనుంది.
Nargis-Fakhri-Tunrs-As-Singer-Andhra-Talkies

నవ్వడం ఒక భోగం!నవ్వించడం ఒక వైభోగం!!నవ్వండి,నవ్వించండి!!!

"నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం" అన్నాడు మన జంధ్యాల మహాను భావుడు. ఈరోజుల్లో మనిషి ఎన్నో టెన్షన్స్ మానసిక ఒత్తిడులకు, చికాకులకు గురైపోతూ మానసిక ప్రశాంతతకు దూరమై పోయి అనేక రోగాలకు బలయ్యిపోతున్నాడు. అటువంటి పరిస్థితులలో మనస్సు కాస్త కుదుట పర్చే అవకాశాలు దొరికితే ఎంతో హ్యాపీ ఫీలయ్యిపోతాము. అటువంటి సాధనాలలో ఒక సంగీతమైతే మరొకటి ఆరోగ్యకరమైన హాస్యం ఒకటి. ఇప్పుడు మీకు, మీ మనస్సుకు చిన్న రిలీఫ్ ఇద్దామన్న భావనతో కొన్ని తెలుగు జోక్స్అందించే ప్రయత్నం చేసాను. ఇంకెందుకాలస్యం మరి. వెంటనే చదివి నవ్వుకోండి...Read More

నెం: 1 కార్టూనిస్టు కేవలం మల్లిక్ మాత్రమే!

ఎవరైనా సరే మల్లిక్ కార్టూన్స్ చదివితే పగలబడి నవ్వాల్సించే. తెలుగు కార్టూన్ రంగంలో మల్లిక్ సంపాదించుకున్న కీర్తి అంతా, ఇంతా కాదు. ఎవరికీ దక్కనంత స్థాయిలో తనకు అభిమానులను సంపాదిన్చుకున్నాడాయన. మచ్చుకు కొన్ని మల్లిక్ కార్టూన్స్ చూడండి మీరే ఎలా పగలబడి నవ్వుతారో...Read More

తాజా కలకలం లేపిన నటుడి ఆత్మహత్యాయత్నం

Huccha-Venkat-Suicide-Attempt-Andhra-Talkies
శాండిల్ వుడ్ కు చెందిన నటుడు ఒకరు సూసైడ్ అటెంప్ట్ చేసిన వైనం షాకింగ్ గా మారింది. పినాయిల్ తాగిన అతను.. తాను సూసైడ్ చేసుకున్నట్లుగా స్నేహితులకు.. మీడియాకు చెప్పుకున్నారు. దీంతో స్పందించిన స్నేహితులు సదరు నటుడ్ని ఆసుపత్రికి తరలించి.. వైద్య చికిత్సలు చేస్తున్నారు. ఇంతకీ ఆ నటుడు ఎవరు? ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేశారన్నది చూస్తే..

కన్నడ సినిమాల్లో నటిస్తుంటాడు హుచ్చ వెంకట్. ఇతగాడి తాజా చిత్రం పోకిరీ. నెల క్రితం విడుదలైన ఈ చిత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇదిలా ఉండగా ఆదివారం ఫినాయిల్ తాగి... స్నేహితులకు ఫోన్ చేసి తాను సూసైడ్ అటెంప్ట్ చేసినట్లుగా చెప్పారు. లవ్ ఫెయిల్ కావటంతోనే తానీ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా ఫ్రెండ్స్ కు చెప్పాడు. దీంతో.. అతన్ని ఆసుపత్రికి తరలించారు. వెంకట్ ప్రేమించింది ఒక సినీ నటినని.. ఆమెకు తానంటే ఇష్టమేనని.. కాకుంటే నటి తల్లిదండ్రులకు తాను ఇష్టం లేదని.. దీంతో తమ ప్రేమ విఫలమైందని పేర్కొన్నారు.

Read Also : నా బాడీ.. నా ఇష్టం.. అంటున్న శృతి హాసన్

ఇదిలా ఉంటే.. సూసైడ్ అటెంప్ట్ చేసిన వెంకట్ ను ఆసుపత్రికి తరలించగా.. వైద్యం చేస్తున్న వైద్యులపై సదరు నటుడు విరుచుకుపడటమే కాదు రచ్చ రచ్చ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రచార యావతోనే.. వెంకట్ ఇలా వ్యవహరించారన్న విమర్శ వినిపిస్తోంది. ఫినాయిల్ తాగి.. సూసైడ్ అటెంప్ట్ చేసినట్లుగా స్నేహితులకే కాదు మీడియాకుకూడా సమాచారం ఇవ్వటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
* మరింత తాజా సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

‘గరుడ వేగ’ సినిమాకు హాలీవుడ్ టెక్నీషియన్స్

Rajasekhar-Garuda-Vega-for-Hollywood-Cinematographers-Andhra-talkies
పూర్తిగా వరుస ఫ్లాపులతో  ఫాలోయింగ్ కోల్పోయిన రాజశేఖర్.. ‘గరుడ వేగ’ సినిమాతో కొంత మేర జనాల దృష్టిని ఆకర్షించగలిగాడు. ఎల్బీడబ్బ్యూ.. గుంటూరు టాకీస్ లాంటి సినిమాలతో యువ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం ఇందుకు ఓ కారణం. గత దశాబ్ద కాలంలో రాజశేఖర్ మార్కెట్ బాగా దెబ్బ తిన్నప్పటికీ.. అదేం పట్టించుకోకుండా  ఈ చిత్రం మీద ఏకంగా రూ.25 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్లుగా నిర్మాత కోటేశ్వర్ రాజు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఊరికే గొప్పలు చెప్పుకోవడానికి పాతిక కోట్ల బడ్జెట్ అని ప్రకటన ఇచ్చినట్లు కూడా లేదు. ఈ సినిమా కోసం దాదాపు 40 రోజులు జార్జియాలో షూటింగ్ చేయడం విశేషం.

ఐతే ఈ చిత్ర బృందం జార్జియాకు బయల్దేరి వెళ్లాక సినిమాటోగ్రాఫర్ తండ్రి తీవ్ర అనారోగ్యం పాలవడంతో వెనక్కి వచ్చేశాడట. అప్పటికప్పుడు మరో సినిమాటోగ్రాఫర్ అందుబాటులో లేకపోవడంతో హాలీవుడ్ సినిమాలకు పని చేసిన జికా చెలిజ్.. బకుర్ చికొబావా అనే ఇద్దరు ఫ్రెంచ్ సినిమాటోగ్రాఫర్ల సేవల్ని ‘గరుడ వేగ’ కోసం ఉపయోగించుకున్నాడట దర్శకుడు ప్రవీణ్ సత్తారు. వాళ్ల సహకారంతో తెరకెక్కించిన యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చాయని.. జార్జియా ఎపిసోడ్ వరకు ‘గరుడ వేగ’ హాలీవుడ్ లుక్ లో కనిపిస్తుందని అంటున్నాడు ప్రవీణ్. ఈ సినిమాటోగ్రాఫర్ల కోసం నిర్మాత కొంచెం భారీగానే చెల్లించుకోవాల్సి వచ్చిందట. ఈ చిత్రంలో రాజశేఖర్ సరసన ‘విశ్వరూపం’ ఫేమ్ పూజా కుమార్ కథానాయికగా నటిస్తుండగా.. కిషోర్ విలన్ రోల్ చేస్తున్నాడు. ఆగస్టులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది...Read More

నా బాడీ.. నా ఇష్టం.. అంటున్న శృతి హాసన్

Iam-Answerable-To-None-Says-Sexy-Heroin-Shruti-Hassan-Andhra-talkies
'మై బాడీ.. మై రైట్'..  గత కొంత కాలంగా ఈ థీమ్ బాగా ఎక్కువగానే వినిపిస్తోంది. ముఖ్యంగా లింగ బేధాల గురించి చర్చించే సమయంలో ఈ మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఇక అందాల భామలు మరీ ఎక్కువగా అందాలు ఆరబోశారనే మాట వినిపించినపుడు కూడా.. మై బాడీ మై రైట్ అనేస్తుంటారు. ఇప్పుడు సౌత్ బ్యూటీ శృతి హాసన్ కూడా ఈ జాబితాలోకి చేరిపోయింది.

రీసెంట్ ఈ భామ కాసింత కొత్తగా కనిపిస్తోంది. ఇందుకు కారణం ఆమె పెదాల్లో వచ్చిన మార్పే. పాత ఫోటోలకు ఈమె కొత్త లుక్ ను పోల్చి.. లిప్ సర్జరీ చేయించుకుందంటూ నెటిజన్లు చెబుతున్నారు. దీనిపై శృతి చాలా కామెంట్స్ నే ఫేస్ చేయాల్సి వచ్చింది కానీ.. వాటిని ఆమె ఖాతరు చేసినట్లుగా కనిపించలేదు. మరోవైపు.. తాను పెదాలకు ఆపరేషన్ చేయించుకున్నానని కానీ.. కాదనీ కానీ చెప్పలేదు. పైగా 'ఇది నా ముఖం.. నా శరీరం.. దీంతో నేను ఏం చేసుకుంటాననే విషయం వేరెవరికీ సంబంధం లేదు. నేను ఎవరికీ ఆన్సర్ చేయాల్సిన పని లేదు' అనేసింది శృతి హాసన్.

సోషల్ మీడియాలో ఎవరో ఏదో అనుకుంటే నేనెందుకు ఆన్సర్ చేయాలన్నది శృతి  హాసన్ ప్రశ్న. ఇక సినిమాల విషయానికి వస్తే. బాలీవుడ్ మూవీ బెహెన్ హోగీ చిత్ర ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్న శృతి హాసన్.. సంఘమిత్ర ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం హాట్ న్యూస్ అయిపోయింది...Read More

రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ లో బెడ్ అందుకేనట

Huge-bed-in-Ram-Gopal-Varma-office-Company-Andhra-talkies
ఆఫీస్ సెటప్ అంటే గతంలో మాదిరిగా నాలుగు కుర్చీలు.. రెండు టేబుళ్లు ఉండే రోజులు పోయి చాలా కాలమే అయింది. ఇప్పుడంతా హై ప్రొఫైల్ డెకరేషన్స్.. కేబిన్స్ తో హంగామా బాగానే చేస్తున్నారు. ఇంకొందరు అయితే.. వినూత్నమైన ఆలోచనలతో కొత్త తరహాగా నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే.. ఒక దర్శకుడి ఆఫీస్ లో ఏకంగా భారీ బెడ్ సెటప్ ఉంటుంది.

కంపెనీ.. ఈ పేరు వినగానే సగం సంగతులు అర్ధమైపోతాయి. సెన్సేషనల్ డైరెక్టర్ అనిపించుకున్న రామ్ గోపాల్ వర్మ.. కంపెనీ అంటూ ముంబైలో ఆఫీస్ తెరిచిన సంగతి తెలిసిందే. బయట నుంచి చూసేందుకే ఇది సూపర్బ్ గా ఉంటుంది. రీసెంట్ గా ఈ కంపెనీ లోపలి సంగతులు చెప్పాడు ఓ సందర్శకుడు. 'ఆఫీస్ అంతా పెద్ద బల్లులు.. జంతువుల బొమ్మలతో నిండి ఉంటుంది. ఒక రూమ్ కి అయితే.. రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడు అయిన అడాల్ఫ్ హిట్లర్ పేరు పెట్టి ఉంటుంది. వర్మ పర్సనల్ కేబిన్ లో అయితే భారీ బెడ్ సెటప్ కూడా ఉంటుంది. అదెందుకు అని అడిగితే.. మీరెందుకు అనుకుంటున్నారో అందుకే అంటూ ఒక విజిటర్ కు మన దర్శకుడు చెప్పాడట.

ట్విట్టర్లో తన సమాధానాలతో తుప్పు వదిలించేసే వర్మ.. మొత్తానికి చాలా సెన్సేషనల్ ఆన్సర్ ఇచ్చాడనే చెప్పాలి. ఎవరు తమ మైండ్ లో చెడుగా ఆలోచిస్తారు వారికి సేమ్ అలాంటి ఆన్సే ఆయన ఇస్తాడన్నమాట...Read More

నెమలి సెక్స్ పై హీరోయిన్ల రియాక్షన్

Twinkle-Khanna-and-Sonakshi-Sinha-on-Peocock-Sex-Theory-Andhra-Talkies
రాజస్థాన్ హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ మహేష్ చంద్ర శర్మ చేసిన నెమలి లైంగిక జీవితం కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు తెరదీశాయి. మగ నెమలి జీవిత కాలం బ్రహ్మచర్యం చేస్తుందని.. మగ నెమలి కంటి నుంచి వచ్చే నీళ్లు తాగి.. ఆడ నెమలి గర్భం దాల్చుతుందని ఆయన అన్నారు. అందుకే శ్రీకృష్ణుడు అందుకే నెమలి పింఛాన్ని తలపై ధరించాడన్నది ఆయన చెప్పిన మాట.

సెక్స్ చేయడం సరి కాదు అన్నట్లుగా ఉన్న ఈ వ్యాఖ్యలకు సోషల్ మీడియా నుంచి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. బాలీవుడ్ హీరోయిన్స్ అయితే.. విచిత్రంగా రియాక్ట్ అయ్యారు. దాదాపుగా దెప్పిపొడిచేశారు. 'నాకు ఇప్పుడు ఇంటి మీద బెంగ పెరిగిపోయింది. నెమళ్లు ఎందుకు సెక్స్ చేసుకోవంటే.. అడివిలో ఎక్కువ డ్యాన్స్ చేస్తూ ఉండుంటాయ్.. ఎవరు చూడొచ్చారు. అయినా సరే మంచి ఫన్ మిస్ అవుతున్నా' అంటూ ట్వీట్ చేసింది అక్షయ్ కుమార్ భార్య కం మాజీ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా. 'నేను ఇప్పుడు కాసిన్ని కన్నీళ్లు తాగుదామని చూస్తున్నా' అని ట్వీట్ పెట్టింది శృతి సేథ్.

ఇక ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా అయితే.. 'నెమళ్లు సెక్స్ చేయవని కొందరు చెబుతున్నారు. అవి కన్నీళ్లు మాత్రమే తాగి పిల్లలను కంటాని అంటున్నారు. వావ్.. మతి పోతోందిగా.. మెల్లగా చప్పట్లు కొట్టండి' అంటూ వెక్కిరించింది. మొత్తానికి ఈ పీకాక్ సెక్స్ కాన్సెప్ట్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది...Read More
Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...