నడిరోడ్డుపై కేకలు పెట్టించిన మలైకా అరోరా

Malaika-Arora-goes-shopping-for-household-items-Andhratalkies
సాధారణంగా సెలబ్రిటీ సుందరాంగుల షాపింగ్ అంటే.. భారీ షాపింగ్ మాల్స్ లోనో.. లేకపోతే ఫారిన్ కంట్రీస్ లోనో ఉంటుంది. కానీ ఇండియన్ బ్యూటీస్ ఎవరూ.. తమకు క్రేజ్ ఉన్న ఏరియాలో రోడ్ సైడ్ షాపింగ్ చేసేందుకు సిద్ధపడరు. ఒకటి స్టేటస్ కారణమైతే.. జనాలు గుమిగూడిపోయే ప్రమాదం ఉండడం మరో రీజన్ గా చెప్పచ్చు. కానీ కెవ్వు కేక బ్యూటీ మలైకా అరోరా మాత్రం తాను అలా కాదు అని చెప్పకుండానే.. చేసి చూపించేసింది.

ఈమెకు ఏదో స్టేషనరీ అవసరం పడగానే.. రోడ్డు పక్కన కార్ ఆపేసి కనిపించిన స్టేషనరీ దుకాణంలోకి దూరిపోయింది మలైకా. అమ్మడి షాపింగ్ ని.. డేరింగ్ ని అయితే.. పొగడాల్సిందే కానీ.. అలా వెళ్లినపుడు మలైకా అవతారమే కీలకమైన పాయింట్. బాగా డీప్ కట్స్ ఉన్న టాప్.. లోపల నుంచి కనిపిస్తున్న డెనిమ్ మినీస్.. మలైకో సోకులను దాయడం లేదు సరికదా మరింతగా ఎక్స్  పోజ్ చేసేస్తున్నారు. స్టైలింగ్ విషయంలో ఎప్పుడూ టాప్ గేర్ లో ఉండే మలైకా.. రోడ్డు పక్క షాపింగ్ తో కేకలు పెట్టించేసింది.

అదృష్టవశాత్తూ ఎక్కువ మంది గమనించేలోపే తుర్రుమనేసింది కానీ.. లేకపోతే సిట్యుయేషన్ ఎలా ఉండేదో! తాను ఐటెం సాంగ్స్ కోసమే పుట్టాను అన్నట్లుగా మాట్లాడే మలైకా అరోరా ఖాన్.. ప్రస్తుతం సినిమాల విషయంలో స్పీడ్ తగ్గించింది. 

నాన్న ఎలా చెబితే అలాగే సర్దుకుంటానన్న హీరోయిన్

Rakul-Preet-Singh-Interview-Andhra-Talkies
Rakul-Preet-Singh-Interview-Andhra-Talkies
టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ నటించిన లేటెస్ట్ మూవీ విన్నర్.. ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. మెగా హీరో సాయిధరం తేజ్ తో కలిసి ఈ భామ నటించగా.. మెగా ఫ్యామిలీతో వరుసగా మూడో చిత్రం ఇది. సరైనోడు.. ధృవ.. ఇప్పుడు విన్నర్ అంటూ వచ్చేస్తోందీ బ్యూటీ.

ప్రమోషన్స్ లో భాగంగా తెగ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్న రకుల్.. తనకు పొట్టి బట్టలు వేసుకోవడం అసలు ఇష్టం లేదని చెప్పింది. 'ఇంట్లో ముఖ్యంగా మమ్మీ మిస్ ఇండియా అయేందుకు ప్రయత్నించమని సలహా. కానీ నాకు మరీ పొట్టి బట్టలు వేసుకోవడం ఇష్టం ఉండదు. నాకు కొంచెం సిగ్గు ఎక్కువే. నాకు మా నాన్న బాగా సపోర్టివ్. ఇప్పుడు ఇలా సింగిల్ గా ఉండగలగుతున్నానంటే.. నాన్నకు నా మీద ఉన్న నమ్మకం. ఒకవేళ నేనేదైనా రాంగ్ స్టెప్ వేస్తే.. బ్యాగ్ సర్దేసుకుని వచ్చేయమంటే వెళ్లిపోతా. అది భయం కాదు.. ఆయన మీద గౌరవం' అని చెప్పింది రకుల్ ప్రీత్ సింగ్.

ఇక పెళ్లిపై కూడా ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది రకుల్. 'నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. అందుకే మాట్లాడ్డం కూడా నేర్చుకున్నా. అలాగే ఇక్కడే ఇల్లు కొనుక్కున్నా. నచ్చినవాడు ఎవరైనా దొరికితే.. ఇక్కడికే వచ్చి సెటిల్ అవమంటా' అని చెప్పిన రకుల్ ప్రీత్.. 'ఇప్పటివరకూ అలాంటివాళ్లెవరకూ తగల్లేదు. అయినా నేనింకా చిన్నపిల్లనే' అనేసింది. 

భావనా రంగంలోకి దిగు : అమలాపాల్!

Amala-Paul-Encourages-Bhavana-Andhra-Talkies
తాజాగా మలయాళ హీరోయిన్ భావన కిడ్నాప్ కు గురైన సంగతి తెలిసిందే. 25 కిలోమీటర్ల పాటు రన్నింగ్ కార్ లో వేధించారు దుండగులు(ఆమె కారు మాజీ డ్రైవర్లు). ఈ ఘటనపై పోలీసులకు ధైర్యంగా ఫిర్యాదు చేసి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది భావన. సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్న హీరోయిన్లు.. ఇలా పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం చాలాచాలా అరుదు.

భావన చూపిన ధైర్యంపై ఇప్పుడు మరో హీరోయిన్ అమలాపాల్ స్పందించింది. భావనను ఓ ధీరవనితగా అభివర్ణిస్తూ ఆమె ఫోటో షేర్ చేసిన అమలాపాల్.. 'మహిళల పవిత్రతను తమకు గిఫ్ట్ గా కొందరు భావించడంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటిదేదో జరుగుతుందన్న నా భయం.. నా తోటి నటి విషయంలో నిజమైంది. హ్యాట్సాఫ్ టు ఐరన్ లేడీ భావన. మా యాక్ట్రెస్ లలో తనే నిజమైన హీరో. ఈ మొత్తం ఘటన గురించి ఏ మాత్రం ఆలోచించకుండా పోలీసులకు ఫిర్యాదు చేశావ్' అని ప్రశంసించింది.

'నేను నీకు తోడుగా నిలుస్తాను భావనా. నువ్వ మరింత స్ట్రాంగ్ గా తిరిగి వస్తావ్. ఇప్పుడు మీడియా కొంత బాధ్యతను చూపించాల్సిన సమయం అసన్నమైంది. చట్టం వ్యాపింపచేయలేకపోతున్న ఓ సందేశాన్ని.. మీడియా బాధ్యతగా తీసుకోవాలి. యాక్టర్ల వ్యక్తిగత జీవితాలపై చూపేలాంటి ఇంట్రెస్ట్ నే.. ఈ అంశంపై కూడా చూపించాలి. ఇలాంటి పనులు చేసే వాళ్లను.. వాళ్ల కుటుంబాలను వెలుగులోకి తీసుకొచ్చి.. మరోసారి ఎవరూ చేయకుండా బుద్ధి చెప్పాలి' అనింది అమలా పాల్.

'ఇది కేవలం సోషల్ మీడియాలో మాత్రమే ప్రచారం చేస్తే సరిపోదు. దీన్ని ఒక ఉద్యమంలా భావించి నడిపించాలని కేరళ యువతను నేను కోరుతున్నా. నా మద్దతు.. ధైర్యం చూపించేందుకు నేను రెడీగా ఉన్నా. రంగంలోకి దిగాల్సిన సమయం ఇది' అంటూ ఆవేశంగా అయినా తన ఉద్దేశ్యాలను సుదీర్ఘంగా వివరించింది అమలాపాల్.

కాజల్ ఎక్కడా కాంప్రమైజ్ కాదట!

Kajal-Agarwal-Shares-pic-at-Trisha-Designer-Store-Andhra-Talkies
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. ఇప్పుడు కెరీర్ లోనే పీక్ స్టేజ్ లో ఉంది. మెగాస్టార్ చిరంజీవి మూవీ ఖైదీ నంబర్ 150తో గ్రాండ్ సక్సెస్ సాధించేసిన ఈ భామలో ఇప్పుడు హుషారు బాగానే పెరిగిపోయింది. దీనికి ముందు జనతా గ్యారేజ్ ఐటెం సాంగ్ తో కూడా బ్లాక్ బస్టర్ కొట్టేసింది. వరుసగా ఈమె సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ లో చేరిపోవడం.. భారీ ప్రాజెక్టులు చేతిలోకి రావడంతో కాజల్ కి సంతోషం రెట్టింపు అయిపోయింది.

షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ ల లాంటివి ఈమెకు కొత్తేమీ కాదు కానీ.. తాజాగా హైద్రాబాద్ లో జరిగిన ఇలాంటి ఓ కార్యక్రమానికి చక్కగా చీరకట్టుతో విచ్చేసిన కాజల్.. ఆ తర్వాత షేర్ చేస్తున్న ఫోటోలు చూస్తుంటేనే.. అసలు టార్గెట్ ఏంటో అర్ధమవుతుంది. క్లీవేజ్ షోకులు కనిపిస్తున్న ఫోటోలు ఏరి ఎంపిక చేసి మరీ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తోంది చందమామ. గతంలో కూడా అమ్మడు గ్లామర్ కురిపించేది కానీ.. మరీ ఇలా ఓపెన్ అయిపోయేది కాదు. ఇప్పుడు కాజల్ ట్రెండ్ మార్చేసినట్లుగా కనిపిస్తోంది.

ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ అజిత్ మూవీ వివేకంలోను.. ఇళయ దళపతి విజయ్ 61లోను.. తెలుగులో నేనేరాజు నేనే మంత్రి అంటూ రానాకు జోడీగాను నటిస్తోంది కాజల్. ఇన్నేసి క్రేజీ ప్రాజెక్టులు చేతిలో ఉన్న టైంలో కూడా.. షోకుల ప్రదర్శనలో కాజల్ కాంప్రమైజ్ కాకపోవడం ఆశ్చర్యకరమే. 

ఓర్నీ.. రెండు రోజుల ముందే రివ్యూ పెట్టేశారే

Ghazi-Movie-Reviews-Published-Two-Days-Before-Andhra-Talkies
ఇదెక్కడి పోటీ రా బాబు అన్నట్లుగా మారింది తెలుగు మీడియా యవ్వారం చూస్తుంటే. ఏదైనా జరిగిన వెంటనే ఉన్నది ఉన్నట్లుగా వార్తలు ఇచ్చే వారు కొందరైతే.. ఊహాగానాలతో వార్తలు ఇచ్చేస్తున్న వారు మరికొందరు. కాసేపట్లో ఏం జరుగుతుందో అంచనా వేసేసి.. జరిగిపోయినట్లుగా వార్తలు ఇచ్చేసి.. మళ్లీ నాలుక్కర్చుకొని వెనక్కి తగ్గుతున్న వైనాలు ఈ మధ్య ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

మొన్నటికి మొన్నన అమ్మ మరణాన్ని అధికారికంగా ప్రకటించటానికి దాదాపు ఏడెనిమిది గంటల ముందే ప్రకటించేసిందో ప్రముఖ తెలుగు మీడియా సంస్థ ఒకటి.  తెలుగు నేల మీద కాబట్టి సరిపోయింది కానీ.. అదే తమిళగడ్డ మీద ఇలాంటి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తే పరిస్థితి మరోలా ఉండేదన్న మాట మీడియా వర్గాల్లో వినిపించింది. అమ్మ మరణాన్ని సదరు మీడియా సంస్థ రెండుసార్లు చంపేసిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కానీ.. పోటీలో మునిగి తేలుతున్న మీడియా సంస్థలు తమపై వస్తున్న విమర్శల్ని లైట్ తీసుకోవటం లేదన్నది వేరే విషయం.

ఇప్పుడు అలాంటి విచిత్రమైన యవ్వారమే చోటు చేసుకుంది. సినిమా రివ్యూల్ని సినిమా విడుదలకు ముందే పెట్టేసే తీరు కొత్త కానప్పటికీ.. చిన్న చిన్న వెబ్ సైట్లు చేస్తుంటాయి. ప్రీమియర్ షోలు వేసినప్పటికి.. సినిమా విడుదల కాకముందే రివ్యూ బయటకు వచ్చేయటం మర్యాద కాదన్న మాట వినిపిస్తూ ఉంటుంది. పాత్రికేయ ప్రమాణాల పరంగా చూసినా కూడా ఇది నిజమనే చెప్పాలి.

పోటీ పరుగు పందెంలో పడిన తెలుగు మీడియా సంస్థలకు ఇప్పడవన్నీ ఏమీ ఉండటం లేదు. శుక్రవారం విడుదల కానున్న ఘాజీ సినిమా స్పెషల్ ప్రీమియర్ షో ను ఈ రోజు ఉదయం వేశారు. మామూలుగా అయితే.. సినిమా విడుదలకు రెండు రోజుల ముందు ప్రివ్యూలు ప్రదర్శించటం చాలా అరుదు. అందులోకి ఇప్పుడున్న పోటీ పరిస్థితుల్లో ఏ ఒక్కరూ తేడాగా వార్తల్ని స్ప్రెడ్ చేస్తే.. కోట్లాది రూపాయిలు పెట్టిన తీసిన సినిమా మొత్తంగా మునిగిపోతుంది. ఇలాంటి ప్రమాదం ఉన్నప్పటికీ రెండు రోజుల ముందే ప్రివ్యూవేశారంటేనే సినిమా బాగా వచ్చిందన్న నమ్మకం ఉంటే తప్పించి ఆ సాహసాన్ని చేయలేరు.

చిత్రమైన విషయంఏమిటంటే.. సినిమా విడుదలకు రెండు రోజుల ముందు వేసిన ప్రత్యేక ప్రివ్యూ షోను.. తెలుగు మీడియాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థలు పెట్టేయటం. సినిమా బాగుంది కాబట్టి సరిపోయింది. ఒకవేళ..బాగోకుంటే.. ఆ నిర్మాత పరిస్థితి ఏమిటి? ఆ సినిమా పరిస్థితి ఏమిటి? ఏ రకంగా చూసినా సినిమా విడుదలకు ఇన్ని రోజుల ముందు రివ్యూ (ప్రీమియర్ టాక్ అని.. ఫస్ట్ టాక్ అని రకరకాల పేర్లతో పెట్టేస్తున్నారు) ఇచ్చేయటంపై సరికాదన్న వాదన వినిపిస్తోంది. ఎంత పోటీ అయితే మాత్రం ప్రమాణాలు లేకపోవటం ఏమిటి..?

ఈ ప్రేమికుల రోజుకి వాళ్లే హైలైట్

Samantha-and-Naga-Chaitanya-Highlight-Couple-for-this-Valentines-day-Andhra-Talkies
Samantha-and-Naga-Chaitanya-Highlight-Couple-for-this-Valentines-day
ఇవాళ వేలంటైన్స్ డే. ప్రపంచ ప్రేమికుల దినోత్సవం. ఎన్నో ప్రేమలు ప్రారంభమయ్యేది.. మరెన్నో ప్రేమ కథలు ఓ తీరానికి చేరే రోజ ఇది. ఎన్నిసార్లు చెప్పుకున్నా ఎప్పటికీ ఎన్నటికీ బోరు కట్టని తీయని భావం ప్రేమ. ఈ వేలంటైన్స్ డేకి హైలైట్ కపుల్ గా టాలీవుడ్ తారలు అక్కినేని నాగచైతన్య-సమంతల గురించే చెప్పుకోవాలి. ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా పూర్తి చేసుకున్న ఈ జంట.. త్వరలో ఒకటి కాబోతోన్నారు.

ఏం మాయ చేశావే అంటూ మొదలైన వీరి ప్రయాణం.. తర్వాత ఒకరినొకరు మాత్రం మాయ చేసుకోలేదు. స్నేహం మాత్రమే చేశారు. అదే వీరి ప్రేమకు పునాది. అసలు తమ ప్రేమ ఎప్పుడు మొదలైందో కూడా తెలీదని చెప్పేస్తారు ఈ ఇద్దరు. ప్రేమగా మారిన స్నేహంలో అంతగా మునిగి తేలారన్న మాట. ఈ విషయంలో చైతు కాస్త గుంభనంగా ఉన్నా.. సమంత మాత్రం అప్పుడప్పుడు కొన్ని క్లూస్ ఇస్తూనే ఉంది. ఇండస్ట్రీలో తనకు బాగా నచ్చిన వ్యక్తి చైతు అని.. చైతుకి జోడీ నటించడాన్ని ఎంజాయ్ చేస్తానని ఇంటర్వ్యూలలో చెప్పేది. కానీ ఎవరూ ఆ పాయింట్ ని క్యాచ్ చేయలేకపోయారంతే.

ఒకరి కష్టకాలంలో మరొకరు తోడు ఉండడం.. ఒకరి విజయాలను మరొకరు ఎంజాయ్ చేయడం.. అబ్బాయి-అమ్మాయి మధ్య బంధం ధృడమయ్యేందుకు అంతకంటే ఎక్కువ కావాలి. పైగా వీళ్ల లవ్ స్టోరీలో విలన్స్ ఎవరూ లేరు కూడా. ప్రేమపై వీళ్లు క్లారిటీ తెచ్చుకుని ఇంట్లో చెప్పగానే.. వాళ్ల సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిసింది. మరి ఈ వేలంటైన్స్ డేకి.. తన ప్రియురాలికి ఏం గిఫ్ట్ ఇస్తున్నావని చైతుని అడిగితే ఏమన్నాడో తెలుసా?

'ప్రేమే ఒక పెద్ద బహుమతి. అలాంటప్పుడు వేరే బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడంపై నాకు నమ్మకం లేదు' అన్నాడు చైతు. సమంత అయితే 'నా దృష్టిలో ప్రేమ అంటేనే చెయ్' అని చెప్పింది సమంత. ఇంతగా ఒకరినొకరు అర్ధం చేసుకున్నాక.. ఈ వేలంటైన్స్ డేకి హైలైట్ కపుల్ గా వీళ్లిద్దరిని చెప్పుకోవాల్సిందే. 

మగాళ్లతో సంబంధాలు.. డైరెక్టర్ మనోవేదన!

I-am-afraid-to-go-out-for-dinner-with-another-man-says-Karan-Johar-Andhra-Talkies
I-am-afraid-to-go-out-for-dinner-with-another-man-says-Karan-Johar
ఆత్మ కథ రాసి రిలీజ్ చేసినప్పటి నుంచి.. తన లైఫ్ లో చాలానే మార్పులు వచ్చేశాయని బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తెగ బాధపడిపోతున్నాడు. ముఖ్యంగా మీడియా నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని అంటున్నాడు కరణ్. ప్రస్తుతం మగాళ్లతో బయట కనిపించాలంటేనే.. భయపడే పరిస్థితి కల్పించారని ఆవేదన చెందుతున్నాడు.

'యాన్ అన్ సూటబుల్ బాయ్' అంటూ ఆటోబయోగ్రఫీలో కొన్ని నిజాలను చెప్పిన తర్వాత.. బయట ఎక్కడ మగవాళ్లతో కనిపించినా.. వారితో తనకు సంబంధం అంటగడుతున్నారని.. అతనితో పడుకున్నారా అని జర్నలిస్టులు అడుగుతున్నారని వాపోయాడు కరణ్. డిన్నర్ కు వెళ్లినా ఇలాంటి వేధింపులు తప్పడం లేదన్న ఈ దర్శకుడు.. ఇద్దరు మగాళ్లు కలిసి డిన్నర్ చేయడంలో తప్పేంటో అర్ధం కాలేదని చెబుతున్నాడు. తాజాగా అజయ్ దేవగన్ తో వచ్చిన వివాదంపై కూడా స్పందించాడు కరణ్ జోహార్.

ఓ పార్టీలో కాజోల్ గురించి ఏదో మాట్లాడానని.. నాకు ఫోన్ చేసిన అజయ్.. కనీసం నేను చెప్పినది కూడా వినకుండా నోటికొచ్చినట్లు మాట్లాడాడు. అలాగే.. శివాయ్ మూవీకి వ్యతిరేకంగా నేను పని చేశానని తను చేసిన ఆరోపణలు కూడా అవాస్తవం అని చెప్పాడు కరణ్ జోహార్. 

ఓం నమో.. ఆరంభం అదరలేదు!!

Om-Namo-Venkatesaya-First-Day-Collections-Andhra-Talkies
Om-Namo-Venkatesaya-First-Day-Collections-Andhra-Talkies
అక్కినేని నాగార్జున- కె. రాఘవేంద్ర రావుల కాంబినేషన్ లో రూపొందిన ఓం నమో వేంకటేశాయ ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. అన్నమయ్య తర్వాత వెంకటేశ్వరుడు-భక్తుడు థీమ్ తో రూపొందిన సినిమా కావడంతో ఆ స్థాయిలోనే ఉంటుందనే అంచనాలున్నాయి. సినిమా పరంగా నాగ్ నిరుత్సాహపరచకపోయినా.. మొదటి రోజు వసూళ్లు మాత్రం బయ్యర్లను నిరుత్సాహపరిచాయి.

ఓం నమో వేంకటేశాయకు తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా కేవలం 2.4 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. నైజాంలో 54 లక్షలు.. ఉత్తరాంధ్రలో 27 లక్షలు.. ఈస్ట్ 17 లక్షలు.. వెస్ట్ 23 లక్షలు.. కృష్ణా 9 లక్షలు.. గుంటూరు 37 లక్షలు.. నెల్లూరు 12 లక్షలు వసూళ్లు రాగా.. మొత్తం ఏపీలో 1.25 కోట్ల కలెక్షన్స్ దక్కాయి. సీడెడ్ లో కేవలం 26 లక్షలను మాత్రమే ఈ చిత్రం రాబట్టగలిగింది. తెలుగు రాష్ట్రాల్లో 2.05 కోట్ల కలెక్షన్స్ రాగా.. వరల్డ్ వైడ్ గా మిగిలిన ఏరియాల వసూళ్లతో కలిపి 2.4 కోట్లను మాత్రమే ఈ సినిమా రాబట్టగలిగింది.

మనం.. సోగ్గాడే చిన్ని నాయన.. ఊపిరి వంటి వరుస విజయాలతో ఊపు మీదున్న నాగార్జున సినిమాకి తగినట్లుగా ఈ కలెక్షన్స్ లేవు. అయితే.. టాక్ బాగుండడంతో మెల్లగా ఊపందుకుంటుందనే అంచనాలు మాత్రం ఉన్నాయి. 

ఒక వారం రోజుల్లోనే పెట్టుబడి మొత్తం తెచ్చేసిన నాని సినిమా "నేను లోకల్"

Nenu-Local-Collections-Update-Andhra-Talkies-300x200
Nenu-Local-Collections-Update-Andhra-Talkies-300x200
‘నేను లోకల్’ సినిమాకు నాని కెరీర్లోనే అత్యధికంగా బిజినెస్ జరిగింది. బిజినెస్ రూ.20 కోట్లు దాటగా.. పబ్లిసిటీ ఖర్చులతో కలిపితే ఈ చిత్రం రూ.22 కోట్లు వసూలు చేస్తేనే బ్రేక్ ఈవెన్ కు వచ్చే పరిస్థితి. నాని ఎంత ఊపులో ఉన్నప్పటికీ ఈ సినిమా అంత వసూలు చేయగలదా అని చాలామంది సందేహించారు. కానీ నాని సినిమా అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. తొలి వారాంతంలోనే ఏకంగా ఈ చిత్రం రూ.15 కోట్ల షేర్ కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. వీక్ డేస్ లో కూడా పెద్ద వీక్ కాకుండా మంచి వసూళ్లతో దూసుకెళ్లింది. వారం రోజులు తిరిగేసరికే ‘నేను లోకల్’ పెట్టుబడి మొత్తం వెనక్కి తెచ్చేసి.. లాభాల బాట పట్టేసింది.

#NTR27.. పెద్ద ఎన్టీఆర్ పక్కనే ఎన్టీఆర్

NTR-and-Bobby-movie-Launched-Andhra-Talkies
NTR-and-Bobby-movie-Launched-Andhra-Talkies
ఇవాళ అధికారికంగా యంగ్ టైగర్ కొత్త మూవీ షూటింగ్ ప్రారంభమైంది. బాబీ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి.. ఇవాళ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

దేవుళ్ల పటాలపై తీసిన మొదటి షాట్ కు ఎన్టీఆర్ స్వయంగా తొలి క్లాప్ కొట్టగా.. పక్కనే సీనియర్ ఎన్టీఆర్ నిలువెత్తు ఫోటోను ఏర్పాటు చేయడం విశేషం. దర్శకుడు బాబీకి వివి వినాయక్ స్క్రిప్ట్ అందించగా.. ఈ పూజా కార్యక్రమాలకు నందమూరి హరికృష్ణ.. నందమూరి రామకృష్ణలు హాజరయ్యారు. ఇవాళ తొలిషాట్ షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభించనున్నారు.

జై లవ కుశ అనే వర్కింగ్ టైటిల్ పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. రాశి ఖన్నా.. నివేదా థామస్ లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. వీరిద్దరూ ఎన్టీఆర్ తో తొలిసారి నటిస్తుండడం విశేషం. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలకు టాప్ లీగ్ లోని స్టార్ హీరోతో సినిమా చేయడం కూడా ఇదే మొదటిసారి. మరోవైపు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. ఆగస్ట్ 11న రిలీజ్ చేయాలనే లక్ష్యంతో షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నాడు నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్. 

మోడీ సినిమాకు నో అన్న సెన్సార్ బోర్డ్ | Andhra Talkies

Censor-Board-no-clearance-for-Modi-themed-feature-film-Andhra-Talkies
Censor-Board-no-clearance-for-Modi-themed-feature-film-Andhra-Talkies
దేశ ప్రధానిని ఎలివేట్ చేస్తూ.. ఆయన్ను గొప్పగా చిత్రీకరిస్తూ తీసిన సినిమాకు సెన్సార్ చిక్కులు ఉంటాయా? అన్న సందేహం కలగొచ్చు. కానీ.. తాజాగా ప్రధాని మోడీని.. ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రేరణగా తీసుకొని నిర్మించిన ‘‘మోదీ కా గావ్’ చిత్రానికి సెన్సార్ చేసేందుకు సెన్సార్ బోర్డ్ నో చెప్పేసింది. ఈ చిత్రాన్ని రేపు (ఫిబ్రవరి 10న) విడుదల చేయాలని భావించారు.

పారితోషికం మొత్తాన్ని వెనక్కిచ్చేసిన రాఘవ లారెన్స్!

Lawrence-Returns-Full-Remuneration-to-Producer-Chowdary-Andhra-Talkies
Lawrence-Returns-Full-Remuneration-to-Producer-Chowdary-Andhra-Talkies
రాఘవ లారెన్స్ మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నాడు. సేవా కార్యక్రమాల కోసం కోట్లు కోట్లు ఖర్చు చేసే అతను.. తాజాగా ఒక నిర్మాత శ్రేయస్సు కోరి.. తన సినిమా సజావుగా విడుదల కావాలని మొత్తం తన పారితోషకాన్నే వెనక్కి ఇచ్చేయడం కోలీవుడ్లో చర్చనీయాంశం అవుతోంది. తెలుగులో రెండేళ్ల కిందట బ్లాక్ బస్టర్ హిట్టయిన ‘పటాస్’ సినిమాను లారెన్స్ హీరోగా తమిళంలో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం పేరు.. మొట్ట శివ కెట్ట శివ. అగ్ర నిర్మాత ఆర్.బి.చౌదరి.. మదన్ అనే మరో నిర్మాతతో కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. ఐతే సినిమా పూర్తయ్యాక మదన్ కనిపించకుండా పోయాడు. అతను ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాడు.

57 గంటల్లో 5 మిలియన్ దాటేసిన కాటమరాయుడు!

Katamarayudu-Movie-Teaser-Record-in-Youtube-Andhra-Talkies
Katamarayudu-Movie-Teaser-Record-in-Youtube-Andhra-Talkies
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఇప్పుడు కాటమరాయుడు సినిమా తన తాలూకు ప్రతాపం చూపించేస్తోంది. ముఖ్యంగా మొన్న రిలీజైన టీజర్ యుట్యూబ్ లో దూసుకుపోతోంది అంతే. ఏకంగా రికార్డు ఫీట్లను చేస్తోంది.

కేవలం అప్ లోడ్ చేసిన 57 గంటల్లోనే 5 మిలియన్ వ్యూస్ రాబట్టేసింది ''కాటమరాయుడు'' టీజర్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కొత్త లుక్.. రాయలసీమ ఫీల్.. లుంగీలో చేసిన సందడి.. అలాగే ఎవడున్నాడనేది ముఖ్యం అంటూ పలికిన ఒక పంచ్ లైన్.. అభిమానులను ఆలరించేసింది. దానితో ప్రతీ ఒక్కరూ మౌత్ టాక్ చాలా పాజిటివ్ గా స్ర్పెడ్ చేయడంతో.. గత రెండు రోజుల నుండి యుట్యూబ్ లో ఈ టీజరే టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. అందుకే ఇంత సులభంగా జస్ట్ రెండు రోజులు పూర్తయిన మరి కొన్ని గంటల్లోనే 5 మిలియన్ వ్యూస్ వచ్చేశాయి. పవన్ క్రేజ్ పతాక స్థాయిలో ఉందని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్.

బీచ్ లలో తన అందాలను ఆరబోసిన అందమైన భామలు!

బీచ్ లలో తన అందాలను ఆరబోసిన అందమైన భామలను చూడాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకాలస్యం వెంటనే ఈక్రింది లింక్ క్లిక్ చేసేయండి మరి.

ఇటు తెలుగు రాష్ట్రాలలోను, అటు అమెరికాలోనూ దుమ్ము దులిపేస్తున్న నాని సినిమా "నేను లోకల్"

Nani-Nenu-Local-Movie-Collections-Andhra-Talkies
నేచురల్ స్టార్ జోరు మామూలుగా లేదు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో.. అటు అమెరికాలో నాని సినిమా ‘నేను లోకల్’ దుమ్ము దులిపేస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనూహ్య నిర్ణయాల నేపథ్యంలో ఆందోళనలో ఉన్న ఎన్నారైలు సినిమాలు ఏం చూస్తారులే అని సందేహించారు కానీ.. ‘నేను లోకల్’ మీద ఆ ప్రభావమేమీ కనిపించలేదు. నాని గత సినిమాలన్నింటి కంటే దీనికి భారీగా ఓపెనింగ్స్ వస్తున్నాయి. పెద్ద స్టార్ హీరోల స్థాయిలో వసూళ్లు కుమ్మేస్తున్నాడు నాని. కేవలం గురువారం ప్రిమియర్లతోనే 1.66 లక్షల డాలర్లు కొల్లగొట్టిన ఈ చిత్రం శుక్రవారం 1.936 లక్షలు డాలర్లు ఖాతాలో వేసుకుంది. శనివారం అంతకంటే మిన్నగా 2.83 లక్షల డాలర్లు వసూలయ్యాయి. అంటే రెండో రోజుకే ఈ చిత్రం 6.433 (రూ.4.32 కోట్లు) లక్షల డాలర్లు వసూలు చేసి హాఫ్ మిలియన్ మార్కును అలవోకగా దాటేసింది.

ఆదివారం వసూళ్లు కూడా కలుపుకుంటే 8 లక్షల డాలర్ల మార్కును దాటేస్తుందన్నమాటే. ఈ ఊపు చూస్తుంటే ‘నేను లోకల్’ సునాయాసంగానే మిలియన్ మార్కును అందుకునేలా కనిపిస్తోంది. ‘భలే భలే మగాడివోయ్’ తర్వాత నాని సినిమాలూ మూడూ అమెరికాలో మంచి వసూళ్లే సాధించాయి కానీ.. మిలియన్ క్లబ్బులోకి చేరలేకపోయాయి. దీంతో అక్కడ ‘భలే భలే..’ హిట్ గాలివాటం అన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీని కంటే ముందు ‘ఈగ’ సినిమాతోనూ నాని అమెరికాలో మిలియన్ డాలర్ క్లబ్బును అందుకున్నాడు. కానీ దాని క్రెడిట్ అంతే రాజమౌళికే వెళ్లిపోయింది. ‘భలే భలే..’ ఫ్లూక్ హిట్ అన్నారు కాబట్టి ‘నేను లోకల్’ విజయం మాత్రం పూర్తిగా నాని క్రెడిట్లోకి వస్తుందనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రెండు రోజుల్లోనే రూ.7.54 కోట్ల దాకా షేర్ వసూలు చేసింది. ‘నేను లోకల్’ ఫుల్ రన్లో ప్రపంచవ్యాప్తంగా రూ.25 కోట్ల దాకా షేర్ రాబట్టే అవకాశముంది.
Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...