57 గంటల్లో 5 మిలియన్ దాటేసిన కాటమరాయుడు!

Katamarayudu-Movie-Teaser-Record-in-Youtube-Andhra-Talkies
Katamarayudu-Movie-Teaser-Record-in-Youtube-Andhra-Talkies
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఇప్పుడు కాటమరాయుడు సినిమా తన తాలూకు ప్రతాపం చూపించేస్తోంది. ముఖ్యంగా మొన్న రిలీజైన టీజర్ యుట్యూబ్ లో దూసుకుపోతోంది అంతే. ఏకంగా రికార్డు ఫీట్లను చేస్తోంది.

కేవలం అప్ లోడ్ చేసిన 57 గంటల్లోనే 5 మిలియన్ వ్యూస్ రాబట్టేసింది ''కాటమరాయుడు'' టీజర్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కొత్త లుక్.. రాయలసీమ ఫీల్.. లుంగీలో చేసిన సందడి.. అలాగే ఎవడున్నాడనేది ముఖ్యం అంటూ పలికిన ఒక పంచ్ లైన్.. అభిమానులను ఆలరించేసింది. దానితో ప్రతీ ఒక్కరూ మౌత్ టాక్ చాలా పాజిటివ్ గా స్ర్పెడ్ చేయడంతో.. గత రెండు రోజుల నుండి యుట్యూబ్ లో ఈ టీజరే టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. అందుకే ఇంత సులభంగా జస్ట్ రెండు రోజులు పూర్తయిన మరి కొన్ని గంటల్లోనే 5 మిలియన్ వ్యూస్ వచ్చేశాయి. పవన్ క్రేజ్ పతాక స్థాయిలో ఉందని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్.

తమిళ సినిమా వీరమ్ కు రీమేక్ అయిన కాటమరాయుడు.. డాలీ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సినిమాతో అనూప్ రూబెన్స్ కూడా తొలిసారి ఒక పెద్ద సూపర్ స్టార్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. 
Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...