యూట్యూబ్ ఛానల్ ను వాడేసిన నీహారిక | Nihaarika used by YouTube channel
చెప్పేది తిన్నగా చెబితే అంత బాగా ఎక్కదు. అందుకే.. కాస్త భిన్నంగా.. మరికాస్త వెరైటీగా చెబితే ఆ కిక్కే వేరు. తాజాగా అలాంటి పనే చేసింది హ్యాపీ వెడ్డింగ్ టీమ్. ట్రైలర్ రిలీజ్ ను అందరి మాదిరి చేస్తే మజా ఏముంటుంది? వైరల్ ఎందుకు అవుతుంది? అందుకే.. రోటీన్ కు భిన్నంగా చేద్దామనుకున్న చిత్రబృందం.. ట్రైలర్ రిలీజ్ కు సంబంధించిన సమాచారాన్ని స్ప్రెడ్ అయ్యేలా చేయటం కోసం కట్ చేసిన ప్రమోషనల్ వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.నిహారిక చేత తిట్టించేసి.. ఆ వెంటనే సర్దుకునేలా చేస్తూ చేసిన ప్రయత్నం ఆకట్టుకుంది. కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తోందా? మరింత క్లారిటీగా చెపుతాం. కారు దగ్గరకు వెళుతున్న నిహారిక ను మేడమ్.. మేడమ్ .. యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం.. మీ వెడ్డింగ్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది? దాని గురించి ఏమైనా చెబుతారా? అంటూ అమాయకంగా గొంతు వినిపిస్తుంది.