మహానటి లీకులతో డైరక్టర్ అప్సెట్

Tollywood-Hero-Nagarjuna-Upset-With-Mahanati-Leaks-Andhra-Talkies
ఇండస్ట్రీలో ఇప్పుడు బయో పిక్స్ హవా నడుస్తోంది. స్పోర్ట్స్ పర్సనాలిటీలపై బయోపిక్స్ తీయడం తేలిక. అందుకే బాలీవుడ్ లో భాగ్ మిల్కా భాగ్ సుల్తాన్ చక్ దే ఇండియా ఎం.ఎస్.ధోనీ రీసెంట్ గా దంగల్ వంటి సినిమాలు తీశారు. ఇవన్నీ హిట్ అయ్యాయి. అయితే సినిమా ఇండస్ట్రీపై బయో పిక్స్ వచ్చింది తక్కువే. కొన్నేళ్ల క్రితం సిల్క్ స్మిత జీవితంపై 'డర్టీ పిక్చర్' తీసి హిట్ కొట్టారు. సినిమా వాళ్ల జీవితంపై పుస్తకాలు బాగానే వస్తాయి తప్ప సినిమాలు రావు. ఈ ట్రెండ్ కు భిన్నంగా నాగ్ అశ్విన్ తెలుగులో బయో పిక్ కు శ్రీకారం చుట్టాడు.

తెలుగు వారికి సుపరిచితురాలైన మహానటి సావిత్రి జీవిత గాథను ఆధారంగా తీసుకుని ‘మహానటి’ పేరుతో సినిమా తీయడానికి నాగ్ అశ్విన్ సిద్ధమయ్యాడు. లీడ్ రోల్ లో కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమాలో సమంత కూడా నటించనుంది. ఈ సినిమాకు ఇటీవల క్లాప్ కూడా కొట్టేసి షూటింగ్ మొదలెట్టేశారు. ఇలా షూటింగ్ మొదలయ్యీ అవక ముందే ఇందులో సమంత కీర్తి సురేష్ గెటప్ లతో పిక్చర్స్ లీకైపోయాయి. దీంతో షాకైపోవడం డైరెక్టర్ నాగ్ అశ్విన్ వంతయింది. సావిత్రిగా కీర్తిసురేష్ ఎలా ఉంటుందో వెండితెరపైనే చూపించాలనుకున్న నాగ్ అశ్విన్ కు ఇలా గెటప్ రివీల్ అయిపోవడం ఏ మాత్రం నచ్చలేదు. దీనికితోడు జర్నలిస్టు పాత్రలో కనిపించే సమంత లీకయిన పిక్చర్స్ లో మహారాణి గెటప్ లో కనిపిస్తోంది.

సినిమా రిలీజవ్వక ముందే అందుకు సంబంధించిన విషయాలు అన్నీ బయటకు వచ్చేస్తే థ్రిల్ పోతుందన్నది దర్శకుడి బాధ. బాహుబలి-1 సినిమాకు కూడా కొన్ని యుద్ధం సీన్లు షూటింగ్ కు ముందు బయటకొచ్చాయి. అప్పటి నుంచి మేకర్స్ సినిమాకు సంబంధించి  ప్రతి విషయం పకడ్బందీగా ఉండేలా చూసుకున్నారు. దీంతో బాహుబలి-2 కు సంబంధించి చిన్న విషయమూ బయటకు రాలేదు. ఇక నుంచి నాగ్ అశ్విన్ కూడా ఇదే ఫార్ములా ఫాలో అయిపోవడమే. Read More

ఆ సత్తా మీలో ఉందా? రామ్ గోపాల్ వర్మ.

Ram-Gopal-Varma-came-in-support-of-Chalapati-Rao-in-this-controversial-issue
రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఫంక్షన్ లో ఒక్కమాట నోరు జారినందుకు ఎంతగా పరువు పోగొట్టుకోవాలో అంతగా పోగొట్టుకున్నాడు సీనియర్ నటుడు చలపతిరావు. అమ్మాయిలు మనశ్శాంతికి ఎందుకు హానికరం అన్న ప్రశ్నకు ‘అమ్మాయిలు పక్కలోకి పనికొస్తారంటూ ఆయన ఇచ్చిన సమాధానం అందరినీ నివ్వెరపరిచింది. ఈ సమాధానంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో అయితే మాటలతో దాడి చేసినంత పనిచేశారు.

ఈ తరుణంలో చలపతిరావుకు సపోర్టివ్ గా నిలిచాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. చలపతిరావుపై విమర్ళలు చేస్తూ ఏడ్చిపోతున్నవారంతా ఓ ఎమ్మెల్యే స్టార్ కమెడియన్ స్త్రీలను ఉద్దేశించి అసభ్యంగా కామెంట్ చేసినప్పుడు నోరెందుకు విప్పలేదని రామ్ గోపాల్ వర్మ అడిగాడు. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికి ఫేమస్ పర్సన్లను ఎందుకు నిలదీసి అడగలేకపోయారని ప్రశ్నంచాడు. టీవీ ప్రోగ్రాముల్లో వచ్చే డబుల్ మీనింగ్ డైలాగులన్నీ విని ఎంజాయ్ చేస్తున్న వారికి ఆ హక్కులేదని తేల్చిచెప్పేశాడు ఆర్.జి.వి.

ఎప్పుడూ ట్విట్టర్ లో ఇలాంటి వివాదాస్పద కామెంట్లతో వార్తల్లోకెక్కే రామ్ గోపాల్ వర్మ ఉన్నట్టుండి ట్విట్టర్ నుంచి క్విట్ అయిపోయాడు. ఇక నుంచి ఆయన ట్విట్టరు పిట్ట కూయదని అనౌన్స్ చేశాడు. అయితే ఇకపై ఇన్ స్టాగ్రామ్ లో టచ్ లో ఉంటానని క్లారిఫికేషన్ ఇచ్చాడు రామ్ గోపాల్ వర్మ.

సచిన్‌- ఏ బిలియన్‌ డ్రీమ్స్‌ సినిమా ముచ్చట్లు!

Sachin A Billion Dreams - Official Trailer -Sachin Tendulkar
సినిమా పేరు: సచిన్‌- ఏ బిలియన్‌ డ్రీమ్స్‌
కథ.. కథనం: జేమ్స్‌ ఎర్స్‌కిన్‌.. శివకుమార్‌ అనంత్‌
సంగీతం: ఎ.ఆర్‌. రెహమాన్‌
నిర్మాణం: 200నాట్‌ అవుట్‌ ప్రొడక్షన్స్‌
దర్శకత్వం: జేమ్స్‌ ఎర్స్‌కిన్‌
విడుదల తేదీ: 26-05-2017
సచిన్‌ తెందుల్కర్‌ బ్యాట్‌ పట్టుకుంటే చాలు.. బంతులు బౌండరీలు దాటుతాయి. స.... చిన్‌ స.... చిన్‌ సచిన్‌ అంటూ మైదానం గ్యాలరీలోంచి అభిమానుల కేరింతలు అవధులు దాటుతాయి. ఆయన ఆట భవిష్యత్‌ క్రికెటర్లకు పాఠం అయితే అభిమానులకో పండగ. మైదానంలో సచిన్‌ ఆట తీరు.. ఆయన బ్రేక్‌ చేసిన రికార్డుల గురించి అందరికీ తెలిసిందే. కానీ.. బయటి ప్రపంచానికి ఆయన గురించి తెలియని విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటన్నింటినీ తెరపై చూపించే ప్రయత్నమే ‘సచిన్‌- ఏ బిలియన్‌ డ్రీమ్స్‌’ చిత్రం. క్రికెట్‌ దేవుడిగా అభివర్ణించే సచిన్‌ గురించి తెలీని ముచ్చట్లు ఏమిటి? వాటిని ఎంత ఆసక్తికరంగా చెప్పారన్నది చూస్తే..
కథేంటి: ముంబయిలోని ఓ సామాన్య కుటుంబంలో జన్మించిన తెందుల్కర్‌కి చిన్నతనంలోనే క్రికెట్‌పై ఇష్టం ఏర్పడుతుంది. భారత్‌ 1983లో ప్రపంచకప్‌ సాధించడం ఆయనకు క్రికెట్‌పై మరింత ఇష్టాన్ని పెంచుతుంది. పసిప్రాయంలోనే ముంబయిలోని శివాజీ పార్కులో క్రికెట్‌ ఆడుతూ వేగంగా పరుగులు తీయడం కోచ్‌ అచ్రేకర్‌ గమనిస్తారు. భవిష్యత్‌లో సచిన్‌ గొప్ప క్రికెటర్‌ అవుతాడని నమ్మి ఆయన సచిన్‌కు క్రికెట్‌లో కోచింగ్‌ ఇవ్వడం మొదలుపెడతాడు. అచ్రేకర్‌ శిక్షణతో సచిన్‌ రంజీలో.. భారత క్రికెట్‌ జట్టులో ఎలా స్థానం సంపాదించాడు? భారత క్రికెట్‌ జట్టులోనే కాదు క్రికెట్‌కే దేవుడిగా ఎలా మారాడు? క్రికెట్‌ ప్రపంచంలో సచిన్‌ అంత ఎత్తుకు ఎలా ఎదిగాడు? ఈ క్రమంలో ఆయనకు ఎదురైన ఇబ్బందులేంటి? మ్యాచ్‌ ఫిక్సింగుల వంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన ఎలా ఫీలయ్యారు? 24 ఏళ్ల కెరీర్‌లో తాను అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు? తదితర విషయాల కోసం థియేటర్‌కు వెళ్లాల్సిందే.
ఎలా ఉందంటే: ‘సచిన్‌: ఏ బిలియన్‌ డ్రీమ్స్‌’ను సినిమా అనే కంటే కూడా దాన్నో ‘డాక్యుమెంటరీ’గా చెబితే సరిపోతుంది. సచిన్‌ గురించి ప్రతి విషయాన్నీ తెరపై చూపించే ప్రయత్నం చేశారు. ఇందులో సచిన్‌ బాల్యానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు మినహా.. ఎక్కడా ఎవరూ నటించలేదు. ఇన్నాళ్లూ సచిన్‌ గురించి బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను ఈ చిత్రంలో చెప్పారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టినప్పుడు సచిన్‌ భావోద్వేగాలను కళ్లకు కట్టేలా చూపించారు. సచిన్‌ ఆటను ప్రత్యక్షంగా చూడలేని ప్రతీ దృశ్యాన్ని అభిమానులకు రెండు గంటల్లో చూపించే ప్రయత్నం చేశారు.
1996 వరల్డ్‌కప్‌ నుంచి 2011లో భారత్‌ విశ్వవిజేతగా నిలిచే వరకూ సచిన్‌ జీవితంలో ఎదురైన ప్రతీ విషయాన్ని అప్పటి వీడియోలతో సహా చూపించటం క్రికెట్‌ను అందునా సచిన్‌ అభిమానులకు పండుగ లాంటిదే. 2007 ప్రపంచకప్‌ సమయంలో భారత కోచ్‌ తీసుకున్న నిర్ణయాలపై ఎప్పుడూ స్పందించని సచిన్‌.. తన అభిప్రాయాలను ఈ డాక్యుమెంటరీలో తెలియజేశారు. చెప్పకుండా టీమిండియా కెప్టెన్సీ నుంచి తొలగించినప్పుడు ఎలా బాధపడ్డాడో సచిన్‌ వెల్లడించారు.
2011 ప్రపంచకప్‌ సాధించినప్పుడు.. రిటైర్‌మెంట్‌ ప్రకటించినప్పుడు సచిన్‌లోని భావోద్వేగాలను చాలా చక్కగా చూపించారు. సాంకేతికంగా చూస్తే ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సమకూర్చిన నేపథ్య సంగీతం థియేటర్‌ నుంచి బయటకు వచ్చాక కూడా మదిలో నిలిచిపోతుంది. నిజానికి నేపథ్య సంగీతం కారణంగానే సినిమాలో పాటలు లేని లోటు అస్సలు కలుగదు. కొన్ని ఫైల్‌ వీడియోలు రెండుమూడు దశాబ్దాల కిందటివి కావడంతో కొన్నిచోట్ల తెరనిండా కనిపించవు. ఇది కాస్త అసంతృప్తి కలిగించినా.. సుమారు రెండున్నర గంటల్లో సచిన్‌ జీవితాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించిన వైనం ఆకట్టుకుంటుందనే చెప్పాలి.
బలాలు
+ కథ
+ సచిన్‌
చివరిగా.. క్రికెట్‌ దేవుడ్ని వెండితెర మీద నిండుగా చూసుకునేలా చేస్తుంది ‘సచిన్‌..’
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Source : http://www.eenadu.net/movies/latest-movie-news.aspx?item=reviews&no=182

మెగాస్టార్ చిరంజీవి కోసం సల్మాన్ సాయం?

Will-Salman-Khan-do-Cameo-Role-in-Megastar-Movie-Uyyalawada-Narasimha-Reddy-Andhra-Talkies
‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమా విషయంలో అధికారిక ప్రకటన ఏదీ లేదేంటి అనుకుంటుండగా. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ఓపెన్ అయ్యాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాకు పని చేసే టెక్నీషియన్ల వివరాలు చెప్పాడు. స్క్రిప్ట్ వర్క్ కోసం ఎంత మంది రచయితలు పని చేస్తున్నది వివరించాడు. ఈ సందర్భంగానే ఈ సినిమాలో ఆల్ ఇండియా ఆర్టిస్టులు నటిస్తారని అన్నాడు చిరు. ‘ఉయ్యాలవాడ..’ను తెలుగుతో పాటు తమిళం.. హిందీ భాషల్లోనూ తెరకెక్కించబోతున్న నేపథ్యంలో ఆయా ఇండస్ట్రీలకు చెందిన.. నేషనల్ అప్పీల్ ఉన్న ఆర్టిస్టులతో నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్లుగా కచ్చితంగా బాలీవుడ్ భామల్నే తీసుకుంటారని అంటున్నారు.

బాలీవుడ్ హీరోయిన్లే కాదు.. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సైతం ఈ చిత్రంలో నటించే అవకాశం ఉందంటున్నాయి ఈ చిత్ర యూనిట్ వర్గాలు. సల్మాన్ తో ఓ గెస్ట్ రోల్ చేయిస్తే.. హిందీ వెర్షన్ కు నేషనల్ లెవెల్లో మంచి ప్రచారం దక్కుతుందని.. హిందీ ప్రేక్షకులకు ఈ సినిమాను చేరువ చేయడం సులువవుతుందని నిర్మాత రామ్ చరణ్ భావిస్తున్నాడట. సల్మాన్ తో తనకు మంచి సాన్నిహిత్యం ఉన్న నేపథ్యంలో ఆయన్ని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాడట. చిన్న క్యామియో రోల్ కావడంతో సల్మాన్ ఒప్పుకునే అవకాశాలే ఉన్నాయని అంటున్నారు. నిజంగా సల్మాన్ నటిస్తే ‘ఉయ్యాలవాడ..’కు అది కచ్చితంగా పెద్ద ప్లస్ అవుతుంది. మరి తమిళం నుంచి ఏ ఆర్టిస్టుల్ని సంప్రదించబోతున్నారో చూడాలి. ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది. ఈలోపే ఈ సినిమాలో నటించే ఆర్టిస్టులపై క్లారిటీ వచ్చే అవకాశముంది.

Action Movies ఎంజాయ్ చేస్తూ భయంకరమైన ఎండలను మర్చిపోండి.

ఈరోజు కాకినాడలో ఎండలకు బయట పెట్టిన కారు తగలబడిపోయింది. పెద్ద,పెద్ద మంటలు చెలరేగుతూ పూర్తిగా కాలిపోయింది. బయట ఏదో ఒక పని నిమిత్తం మీద వెళ్ళిన వారికి కళ్ళు తిరగడం, కాళ్ళు,చేతులు పీకడం వంటి సమస్యలు వచ్చి చాలా ఇబ్బందులు పడ్డారు. ఇటువంటి పరిస్థితులలో కనీసం వాతావరణం చల్లబడే వరకూ బయట తిరగకపోవడమే చాలా శ్రేయస్కరం. ఆరోగ్యకరం.

ఇటువంటి పరిస్థితులలో ఎండలను పూర్తిగా మర్చిపోవడం కోసం, బోరు కొట్టకుండా ఉండడం కోసం Andhra Talkies వారు తెలుగు డబ్బింగ్ సినిమాల శీర్షికను ప్రారంభించింది. ప్రతి రోజూ 6 సినిమాలను మీకోసం అందిస్తూ వస్తోంది. మీరు మీకు నచ్చిన సినిమాలను డౌన్లోడ్ చేసుకుని ఫుల్ ఎంజాయ్ చేయండి. ఎండలలో బయట తిరగడం పూర్తిగా మానేయండి దయచేసి!
మీకు నచ్చిన సినిమాలు ఇక్కడ : Telugu Dubbed Movies

ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసేయాలన్న ప్రముఖ నటి

Shabana-Azmi-on-Triple-Talaq
దేశ వ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతున్న ట్రిఫుల్ తలాక్ మీద ప్రముఖ బాలీవుడ్ నటి..హైదరాబాద్ మూలాలున్న షబానా ఆజ్మీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్ తలాక్ అమానవీయమైనది అభివర్ణించారు. ట్రిపుల్ తలాక్ అంశంపై సుప్రీంకోర్టులో వాడీవేడి వాదనలు జరిగిన విషయం తెలిసిందే. తలాక్ విషయంలో సుప్రీంకోర్టు ఇప్పటికే పలు కీలక వ్యాఖ్యలు చేయగా.. ముస్లిం పర్సనల్ లా బోర్డు మాత్రం తలాక్ ను కొనసాగించాల్సిందేనంటూ బలంగా వాదిస్తున్న సంగతి తెలిసిందే.

తన తుది తీర్పును సుప్రీం వెల్లడించాల్సి ఉన్న సమయంలో.. తాజాగా షబానా ఆజ్మీ ట్రిపుల్తలాక్ గురించి తన వైఖరిని స్పస్టం చేశారు. ట్రిఫుల్ తలాక్ మీద బాలీవుడ్ ప్రముఖులు పెద్దగా స్పందించని వేళ.. షబానా ఆజ్మీ అందుకు భిన్నంగా ఓపెన్ గా గళం విప్పటం ఒక కొత్త పరిణామంగా చెప్పొచ్చు. ట్రిఫుల్ తలాక్ను వ్యతిరేకించటమేకాదు.. పవిత్ర ఖురాన్ సైతం ఎక్కడా ట్రిపుల్ తలాక్ను అనుమతించలేదని మీడియాలో మాట్లాడిన సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు.

తలాక్ కారణంగా ముస్లిం మహిళల సాధికారత.. సమానత్వం హక్కుల్ని కాలరాస్తుందని విమర్శించిన ఆమె.. ట్రిపుల్ తలాక్ మహిళ ప్రాధమిక హక్కులకు భంగకరమన్నారు. ఇంత ఓపెన్ గా ఒక ముస్లిం మహిళా ప్రముఖురాలు ట్రిపుల్ తలాక్ మీద చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి రియాక్షన్ ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది
More Latest Movie News & Videos

ఆ హీరోయిన్ నాదే! అంటున్న సుశాంత్ సింగ్ రాజ్ పుట్

Hero-Sushanth-Singh-RajPut-and-Kriti-Sanon-in-Hyderabad-IPL-Match
ఫిలిం ఇండస్ట్రీలో బోలెడన్ని లవ్ స్టోరీస్ నడుస్తుంటాయి. నిజమైన లవ్ స్టోరీల కంటే సినిమా ప్రచారాల కోసం పుట్టించే కథలు కూడా ఇంకా ఎక్కువే ఉంటాయి. వీటిలో కొన్ని మాత్రం నిజమైన ప్రేమకథో.. సినిమా అల్లిన కట్టుకథో అర్ధం కాదు.

ఎంఎస్ ధోనీ మూవీలో నటించిన హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. మహేష్ 1 నేనొక్కడితో పరిచయమైన కృతి సనోన్ ల కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. మొదట రాబ్తా సినిమా కోసం మొదలైన ప్రేమకథ అనిపించింది. రాన్రాను వీరి లవ్ స్టోరీ ముదిరి పాకాన పడి.. కలిసి చక్కర్లు కొట్టే వరకూ వచ్చింది. ఆ మధ్య ఓ సుశాంత్ ఓ కాస్ట్లీ కార్ కొంటే.. మొదటగా అందులో కృతి సనోన్ తోనే చక్కర్లు కొట్టాడు. అలాంటి వీరిద్దరూ తరచుగా కయ్యాలు ఆడుకుంటూ ఉంటారు. చిన్న గొడవ రాగానే విడిపోయారంటూ మీడియాలో కథనాలు వండి వడ్డించేస్తున్నారు. ఇలాంటివి ఎన్ని రాసినా కృతి సనోన్ మాత్రం నాదే అంటూ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు.

హీరోయిన్ నాదే అనేశాడంటే.. లవ్ స్టోరీ గురించి దాదాపుగా డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేసినట్లే. నిన్న హైద్రాబాద్ లో జరిగిన ముంబై-పూనే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ఇద్దరూ కలిసి పక్కపక్కనే కూర్చుని మ్యాచ్ ఎంజాయ్ చేశారు. ధోనీ బ్యాటింగ్ కి వచ్చినపుడు హంగామా మామూలుగా లేదు. ఈ మ్యాచ్ ఎంత రసవత్తరంగా సాగిందో.. మధ్యమధ్యలో కెమేరా వీళ్లవైపు తిరిగినపుడు.. వీళ్ల కెమిస్ట్రీ కూడా అంతగానే ఆకట్టుకుంది.

ఆఖరికి మన బాలయ్య కూడా పాడేసాడు!

Tollywood-Top-Hero-Balakrishna-Sings-For-His-101st-Movie-Andhra-Talkies
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా విజయం తరువాత బాలయ్య నిర్ణయం అందరినీ ఒక్కసారి షాక్ కు గురిచేసింది. ఎందుకంటే బాలయ్య ఓకే చెప్పింది బి గోపాల్ సినిమా బోయపాటి శ్రీనివాస్ సినిమా కాదు. పచ్చిగా మాటలు.. పోకిరి పనులు.. పొగరున్న హీరో సినిమాలు.. తీసిన పూరీ జగన్నాధ్ డైరక్షన్ లో సినిమా. ఈ కాంబినేషన్ చాలు ఆ సినిమా కథ కన్నా వారి కలయికకు ఎంతటి క్రేజ్ ఉందో చెప్పడానికి. ఔను పోకిరి లాంటి  మాటలు బాలయ్య పలికితే ఎలా ఉంటుంది. మరి అదే ఇప్పుడు అందరిలో ఉన్న ఉత్కంఠ.

ఇప్పుడు అలాంటి సినిమాకి మరో కొత్త సొగసు వచ్చింది. నందమూరి బాలకృష్ణ ఈ సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఒక పాట పాడుతున్నాడు. ఈ సినిమా సంగీత దర్శకుడు అనూప్ రుబెన్స్ కొంపోజ్ చేసిన ఒక పాటకు బాలయ్య గాత్రం అందించేశాడు కూడా. ఈ సినిమాలో బాలయ్య డైలాగ్ కన్నా అతని పాటకు చాలా పవర్ ఉంటుంది అని చెపుతున్నారు. ఇంతకు ముందు పూరీ హీరోలు మహేశ్ రవితేజ కొన్ని సంధర్భాలలో పాడారు. ఇప్పుడు మళ్ళీ సినిమాకి ఆయువుపట్టు అయిన పాత్రచే మళ్ళీ పాడిస్తునాడు ఈ డ్యాషింగ్ డైరక్టర్.

ఈ సినిమా లో బాలయ్యకు జోడీగా అతని లక్కీ చార్మ్ శ్రేయ సరన్ నటిస్తోంది. బాలయ్య ఈ సినిమాలో పక్క బ్యాడ్ బోయ్ లా కనిపిస్తాడు అని అందరూ చెప్పుకుంటున్నారు. పూరీ డోస్ మాటలు బాలకృష్ణ యాక్షన్ తో సెప్టెంబర్ లో విడుదల చేయడానికి అన్ని కసరత్తులు చేస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను జెమిని టివి 6.5 కోట్లకు కొనేసిందని కూడా టాక్ వినిపిస్తోంది. అది సంగతి.
More News : Andhra Talkies Info

ఇస్రాయెల్ దేశంలో మతులు పోగొట్టే మహా అందగత్తె!!

Israeli-Beauty-Doron-Matalon-In-Bikini-Andhra-Talkies
ఇస్రాయల్ అంటే  అందురు అనుకునే మతపిచ్చి దేశంగా దోపిడీలు యుద్ధాలు జరిగే నేలగా తెలుసు. జీవం లేని నదులు సాగరాలు మాత్రమే కాకుండా ఇప్పుడు చాలా మార్పుల వస్తున్నాయి అక్కడ. అక్కడ జనం కూడా మారుతున్నారు. హాలీవుడ్ మోడెలింగ్ లో ఇజ్రాలి యువత ఇప్పుడు గట్టి పోటీ ఇస్తున్నారు. అక్కడ ప్రజలుకు సహజసిద్దంగా వచ్చే అందం చిలిపితనం వాళ్ళని మరింత సెక్సీ గా మారుస్తోంది.

ఇక్కడ ఒక వయ్యారిని చూడండి మీకే వాళ్ళ బాడీ నమూనాలో ఎంత సెక్సీ లుక్ ఉందో అర్ధమవుతుంది. ఇక్కడ బీచ్ లో నిలబడ్డ అమ్మడు మోడల్ కాదు.. మిస్ యూనివర్స్ ఇస్రాయెల్ 2014 గా ఎంపికైన డొరోన్ మతాలోన్. అసలే అక్కడ అమ్మాయిలు అందంకి ప్రపంచం దాసోహం కాగా.. ఈ అమ్మడు మిస్ యూనివర్స్ కావడంతో... ఎండిన ఇజ్రాలిలో విరిసిన గులాబిలా మెరుస్తున్న బీచ్ లో బికినీ తో ఉన్న ఫోజ్ చూస్తే బికినీ వేసే ఆడవాళ్ళకు అధ్యక్షురాలుగా ఉంది కదూ.

ఈ భామలో అందం ఒకటే కాదు ఇస్రాయెల్ ఆర్మీ లో సార్జెంట్ గా కూడా సర్విస్ చేసింది. కాబట్టి ఈ బ్యూటీకి యుద్ధం అందం రెండు తెలుసన్నమాట. ఆ దేశంలో మహిళా శక్తికి తార్కాణంగా ఈమెను చెబుతారులే. ఇకపోతే  2011 లో డొరోన్ మతాలోన్ తన పై జరిగిన అత్యాచారాన్ని ఎదుర్కొని అక్కడ ప్రజలుకు ఆదర్శంగా నిలిచింది. అక్కడ బతకాలి అంటే పువ్వు లా సుకుమారంగా ఉంటే సరిపోదు కత్తిలా పదునుగా కూడా ఉంది తీరాలని ప్రూవ్ చేసింది.

More News : Andhra Talkies Info
Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...