పవన్ 27వ సినిమా రియల్ బందిపోటు కథేనా?
ఓపక్క రాజకీయాలు మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీ కావాలని భావిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇందులో భాగంగా దిల్ రాజు నిర్మిస్తున్న హిందీ పింక్ మూవీలో లాయర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ తో పాటు.. అతి తక్కువ కాల్షీట్లు ఇచ్చిన వైనం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఉదయం రాజకీయాలు.. రాత్రి వేళ సినిమా షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు.ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ఇప్పటికే పట్టాలకెక్కటం.. ఈ సినిమాలో పవన్ గెటప్ ఫోటోలు కొన్ని బయటకు రావటం తెలిసిందే. ఇదిలా ఉంటే..దిల్ రాజు సినిమా ఓపక్క సాగుతున్న వేళలోనే.. పవన్ మరో సినిమా షురూ కానుంది. క్రిష్ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర సమాచారం తాజాగా బయటకు వచ్చింది.