Showing posts with label RGV Movies. Show all posts
Showing posts with label RGV Movies. Show all posts

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘మర్డర్’ సినిమాపై తీర్పు వాయిదా

Judgment-on-Ramgopal-Varma-Movie-Murder-postponed-Andhra-Talkies
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘మర్డర్’ సినిమాపై తీర్పు వాయిదా
మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘మర్డర్’ పేరుతో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.

అయితే తన జీవితంపై సినిమా చేస్తున్న నిర్మాతలకు ప్రణయ్ భార్య అమృత గతంలోనే కోర్టు ద్వారా నోటీసులు పంపింది. అనుమతులు లేకుండా తన కథ ఆధారంగా సినిమా తీస్తున్నారంటూ ఆమె నల్లగొండ జిల్లా కోర్టులో పిటీషన్ వేశారు. మర్డర్ సినిమా విడుదల ఆపాలని.. పబ్లిసిటీ ఆపమని కోరుతూ కోర్టును అమృత కోరారు. ఈ మేరకు కోర్టు ద్వారా మర్డర్ సినిమా నిర్మాతలు నట్టి క్రాంతి నట్టి కరుణలకు నోటీసులు పంపారు.

ఈనెల 6న నిర్మాతలు కోర్టుకు హాజరై వారి వాదనను తెలుపాలని కోర్టు నోటీసుల్లో పేర్కొంది. ‘మర్డర్’ సినిమా ట్రైలర్ ను ఇప్పటికే వర్మ విడుదల చేయగా.. అది వైరల్ అయ్యింది. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు వర్మ ప్లాన్ చేయగా అమృత కోర్టుకు వెళ్లి అడ్డుకుంటోంది.

RGV సినిమా "పవర్ స్టార్" ముందు "పరాన్న జీవి" ఎగిరిపోయింది!

RGV సినిమా "పవర్ స్టార్" ముందు "పరాన్న జీవి" ఎగిరిపోయింది!

the-paranna-jeevi-flew-in-front-of-rgv-movie-power-star
RGV సినిమా "పవర్ స్టార్" ముందు "పరాన్న జీవి" ఎగిరిపోయింది!
జనసేనాని పవన్ కల్యాణ్ రాజకీయ వైఫల్యంపై ఆర్జీవీ తీసిన సెటైరికల్ మూవీ `పవర్ స్టార్` జూలై 25న రిలీజైన సంగతి తెలిసిందే. అదేరోజు ఆర్జీవీపై సెటైర్ వేస్తూ నూతన్ నాయుడు దర్శకత్వంలో పవన్ అభిమానులు తీసిన `పరాన్నజీవి` చిత్రం రిలీజైంది. అయితే ఈ రెండిటిలో ఏది బెస్ట్ రిజల్ట్ అందుకుంది? ఎవరు ఎంత సంపాదించారు? అంటే.. అంతా ఊహించినట్టే `పవర్ స్టార్` ఏటీటీ వేదికపై సక్సెస్ సాధించిందని ప్రచారమవుతోంది. ఈ సినిమా ఏకంగా రెండు కోట్లు వసూలు చేసిందన్నదే షాకింగ్ న్యూస్. అసలు ఏటీటీ కంటెంట్ అన్న పేరుకు తగ్గట్టే ఇది పూర్తి నిడివి సినిమా కానే కాదు. కేవలం 10-12 సన్నివేశాల సమాహారంగా ఒకదానివెంట ఒకటిగా ఎపిసోడ్లు అల్లినట్టు తీసిన 37 నిమిషాల నిడివి లఘు చిత్రంలాగా కనిపిస్తుంది.

రకరకాల వివాదాల్ని క్రియేట్ చేసి ఆర్జీవీ తెచ్చిన హైప్ నడుమ పవర్ స్టార్ సినిమాని మొదటి రోజు జనం బాగానే చూశారు. అయితే అదే రోజు మధ్యాహ్నానికే ఒరిజినల్ క్వాలిటీతో పవర్ స్టార్ మూవీని జనం పైరసీ వీడియోలో చూశారు. ఇది నిజంగా పెద్ద దెబ్బ కొట్టిందన్న విశ్లేషణ సాగుతోంది. అనవసర ఖర్చు లేకుండా పరిమిత బడ్జెట్ తో తీసిన పవర్ స్టార్ ఆర్జీవీ బృందానికి లక్షల్లో లాభాలు తెచ్చిందని విశ్లేషణ సాగుతోంది.

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...