RGV సినిమా "పవర్ స్టార్" ముందు "పరాన్న జీవి" ఎగిరిపోయింది!
![]() |
RGV సినిమా "పవర్ స్టార్" ముందు "పరాన్న జీవి" ఎగిరిపోయింది! |
రకరకాల వివాదాల్ని క్రియేట్ చేసి ఆర్జీవీ తెచ్చిన హైప్ నడుమ పవర్ స్టార్ సినిమాని మొదటి రోజు జనం బాగానే చూశారు. అయితే అదే రోజు మధ్యాహ్నానికే ఒరిజినల్ క్వాలిటీతో పవర్ స్టార్ మూవీని జనం పైరసీ వీడియోలో చూశారు. ఇది నిజంగా పెద్ద దెబ్బ కొట్టిందన్న విశ్లేషణ సాగుతోంది. అనవసర ఖర్చు లేకుండా పరిమిత బడ్జెట్ తో తీసిన పవర్ స్టార్ ఆర్జీవీ బృందానికి లక్షల్లో లాభాలు తెచ్చిందని విశ్లేషణ సాగుతోంది.
ఇక షకలక శంకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన `పరాన్నజీవి`కి ఆదరణ దక్కలేదు. ఈ మూవీని చూసేందుకు జనం ఆసక్తిని కనబరచలేదు. ఫలితంగా కేవలం 10వేల టిక్కెట్ల వరకే అమ్మకాలు సాగాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా రిలీజైన మరుసటి రోజుకే సాంకేతిక కారణాలతో బ్రేక్ పడడం దెబ్బ కొట్టిందట.
ఆర్జీవీ.. షకలక శంకర్ ఇద్దరూ మీడియా వేదికలు ఎక్కి తమ సినిమాలకు బాగానే ప్రచారం చేసుకున్నా అంతిమంగా పవర్ స్టార్ దే విజయం అని చెప్పుకుంటున్నారు. ఇక ఏటీటీ కంటెంట్ అంటేనే రోత పుట్టేలా క్వాలిటీ లేని ఇలాంటి సినిమాలకు మునుముందు ఆదరణ ఉంటుందా? అంటే చెప్పలేం. మహమ్మారీ శాంతించి యథావిథిగా థియేటర్ వ్యవస్థను పునరుద్ధరిస్తే అప్పుడు ఇలాంటి వాళ్ల ఆటలు చెల్లకపోవచ్చు. కానీ ఇప్పట్లో అది సాధ్యమయ్యేట్టు కనిపించడం లేదు. ఓటీటీ తర్వాత ఏటీటీ పుట్టుకొచ్చింది. కానీ ఇది పార్ట్ టైమ్ జాబ్ లాంటిదేననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
No comments:
Post a Comment