ఓ అపరిచితుడి ప్రేమ మాయలో మోసపోయిన లేడీ డైరెక్టర్
![]() |
Lady director deceived by the love magic of a stranger |
ఆమె ఒక ప్రముఖ అసిస్టెంట్ డైరెక్టర్..ఎంతో మంది సీనీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాలు తీసిన ఆ అసిస్టెంట్ డైరెక్టర్ కే సినిమా చూపించాడో ఫేస్ బుక్ తో పరిచయమైన దొంగ ప్రేమికుడు.. ఈ కేటుగాడు ఆ అసిస్టెంట్ డైరెక్టర్ని నిండా ముంచి లక్షల రూపాయలు లాక్కున్నాడు. ఆమెను శారీరకంగానూ, ఆర్ధికంగానూ వాడేసుకున్నాడు.
కర్ణాటక లోని బెంగళూరు నగరంలో ఉన్న మారుతినగర్ లో నివాసం ఉంటున్న 32 ఏళ్ల అందమైన అసిస్టెంట్ డైరెక్టర్ కన్నడ శాండిల్ వుడ్ లోని ప్రముఖ దర్శకుడి దగ్గర సహాయ దర్శకురాలిగా పనిచేస్తోంది. దర్శకురాలిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది.
ఈమెకు 2018లో ఫేస్ బుక్ ద్వారా ఓ యువకుడు పరిచయమయ్యాడు. పరిచయం స్నేహంగా మారి ఒకరోజు ఇద్దరూ కలుసుకున్నారు. ప్రేమ పేరుతో ఆ సహాయ దర్శకురాలిని యువకుడు ముగ్గులోకి దించాడు. పెళ్లి చేసుకుంటానని.. శారీరకంగా దగ్గరయ్యాడు. యువతితో ఎంజాయ్ చేస్తూ ఆమె దగ్గర అవసరాల కోసం లక్షల రూపాయలు తీసుకున్నాడు.
సహజీవనం చేస్తున్న వీరిద్దరూ చాలా రోజులు అయ్యేసరికి సహాయ దర్శకులు రాలు పెళ్లి చేసుకుందామని ప్రపోజల్ పెట్టింది. దీనికి నో చెప్పిన అతడు త్వరలోనే చేసుకుందామంటూ ఓ ఫ్లాట్ లో కాపురం పెట్టాడు. రూ.5 లక్షలు ఇస్తే తన కష్టాలు తీరుతాయని.. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇప్పటికే లక్షలు ఇచ్చిన ఆమె తన వద్ద లేవని చెప్పడంతో ఆమె చేతిలో ఓ మామిడికాయ పెట్టి ప్రియుడు మాయం అయ్యాడు. ఐదునెలలుగా వెతుకుతున్నా అతడి జాడ లేకపోవడం.. మొబైల్ స్విచ్ ఆఫ్ రావడంతో యువతి బెంగళూరు మహిళా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇప్పుడు ఈ మోసగాడి కోసం వెతుకున్నారు.
No comments:
Post a Comment