దేవసేన నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనా.. మరి ఎందుకు నో చెప్పింది..?
![]() |
దేవసేన నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనా.. మరి ఎందుకు నో చెప్పింది..? |
అందుకే ఈ డిజిటల్ విడుదల ఒప్పందాలు కరెక్ట్ కాదని నిశ్శబ్దం మేకర్స్ వెయిట్ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ బ్యూటీ అనుష్క అభిమానులు నిరాశలో ఉన్నారు. ఎందుకంటే చాలా గ్యాప్ తీసుకొని చేసిన నిశ్శబ్దం మూవీ రిలీజ్ కాకుండా నిలిచిపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. అనుష్క తదుపరి ప్రాజెక్ట్ ఏంటని సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. అయితే తాజాగా అనుష్కను నెట్ ఫ్లిక్స్ ఓటిటి వారు ఓ భారీ మల్టీ లాంగ్వేజ్ వెబ్ సిరీస్ ఆఫర్ చేశారట. అందుకోసం భారీ పారితోషికం ఇవ్వడానికి కూడా ఓకే అన్నారట. కానీ అనుష్క వారి ఆఫర్ రిజెక్ట్ చేసిందట. ఇప్పట్లో వెబ్ సిరీస్ లలో నటించే ఇంటరెస్ట్ లేదని చెప్పిందట. మరి స్వీటీ తదుపరి ప్రాజెక్ట్ ఏమిటని.. అందరిలో ఆసక్తి నెలకొంది. కానీ దీని పై స్వీటీ ఎలా స్పందిస్తుందో చూడాలి!
No comments:
Post a Comment