ఐశ్వర్యారాయ్ అమ్మ కాబోతుండటమే సర్ ప్రైజా అభిషేక్ బచ్చన్?

Aishwarya-Husbend-Abhishek-Bhachchan-Giving-Suprise-To-His-Fans-Andhra-Talkies

ఐశ్వర్యారాయ్ అమ్మ కాబోతుండటమే సర్ ప్రైజా అభిషేక్ బచ్చన్?

బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఇటీవల సోషల్ మీడియాలో హాయ్ మీ అందరికి ఒక సర్ ప్రైజ్ వేచి చూస్తూ ఉండండి అంటూ పోస్ట్ చేశాడు. ఆ సర్ ప్రైజ్ ఏమై ఉంటుందా అంటూ ఆయన ఫాలోవర్స్ మరియు మీడియాలో చూసిన వారు అంతా కూడా జుట్టు పీక్కుంటున్నారు. ఎట్టకేలకు ఆ సర్ ప్రైజ్ ఏంటీ అనే విషయమై ఒక క్లారిటీ వచ్చింది. అధికారికంగా అయితే అభిషేక్ క్లారిటీ ఇవ్వకున్నా బాలీవుడ్ వర్గాలు మరియు బచ్చన్ ఫ్యామిలీ మెంబర్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆ సర్ ప్రైజ్ ఏంటీ అంటే ఐశ్వర్య మళ్లీ తల్లి కాబోతుండటమే.

ఔను గత కొన్ని రోజులుగా కెమెరాకు దూరంగా ఉన్న ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరి కొన్ని నెలల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుందట. ఈ విషయాన్ని అనధికారికంగా బచ్చన్ కుటుంబ సభ్యులు జాతీయ మీడియాతో చెప్పినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ వర్గాల్లో కూడా ఇదే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఐశ్వర్యరాయ్.. అభిషేక్ బచ్చన్ లకు ఒక పాప ఉంది. ఇప్పుడు ఆ పాప అక్క అవ్వబోతుంది. ఆమెకు బుల్లి తమ్ముడు లేదా చెల్లి రాబోతుంది.



ఈ విషయాన్ని జూనియర్ బచ్చన్ సర్ ప్రైజ్ గా ఉంచాలని ఐశ్వర్య రాయ్ డెలవరీ అయిన తర్వాత రివీల్ చేయాలనుకున్నట్లుగా ఉన్నాడు. కాని అది అప్పుడే రివీల్ అయ్యింది. ఏమాత్రం అనుమానాలు లేకుండా బచ్చన్ ఫ్యామిలీ నుండి ఒకరు మీడియా ముందుకు వచ్చి ఈ విషయాన్ని అధికారికంగా క్లారిటీ ఇస్తే బాగుండు అంటూ కొందరు ఆశ పడుతున్నారు. అది చేస్తే జూనియర్ బచ్చన్ చేయాలి. ఆ సస్పెన్స్ ను రివీల్ చేస్తూ ఐశ్వర్య గర్బవతి అంటూ ఆయన ప్రకటన కోసం బచ్చన్ మరియు రాయ్ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...