![]() |
Bluff-Master-Movie-in-Telugu-Film-Industry-Andhra-Talkies |
అందులో సత్యదేవ్ స్క్రీన్ ప్రెజెన్స్ - యాక్టింగ్ - డైలాగ్ డెలివరీ.. అన్నీ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబరు 28న ‘బ్లఫ్ మాస్టర్’ రిలీజవుతున్నట్లు ప్రకటించారు. అదే రోజు నిఖిల్ మూవీ ‘ముద్ర’ కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. మరి వీటిలో ఏది పైచేయి సాధిస్తుందో.. సత్యదేవ్ తన టాలెంటుకు తగ్గ హిట్ కొడతాడేమో చూడాలి. ఇంతకుముందు పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ తో ‘రోమియో’ అనే సినిమా తీసిన గోపీ గణేష్ ‘బ్లఫ్ మాస్టర్’కు దర్శకత్వం వహించాయి. శ్రీదేవి మూవీస్ - అభిషేక్ పిక్చర్స్ బేనర్లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ నందిత శ్వేత సత్యదేవ్ కు జోడీగా నటించిందీ చిత్రంలో. రకరకాల ఆర్థిక మోసాలు చేసే బతికే మాయల మరాఠీ పాత్రలో సత్యదేవ్ నటించాడిందులో. తమిళంలో ‘ఖాకి’ దర్శకుడు వినోద్ వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాడు. అతడికదే తొలి సినిమా.
No comments:
Post a Comment