![]() |
Charan told BYE to Rajamouli !! |
ప్రస్తుతం చరణ్ అయ్యప్ప దీక్ష తీసుకుని ఉన్న విషయం తెల్సిందే. దీక్ష ముగింపుకు చరణ్ ఈనెల 7న శబరిమల వెళ్లనున్నాడు. అక్కడ నుండి 9వ తారీకు వరకు వచ్చేయనున్నాడు. 10వ తారీకు నుండి వెంటనే ‘వినయ విధేయ రామ’ చిత్రంలో బ్యాలన్స్ ఉన్న ఆ చివరి పాటను చేయబోతున్నాడు. ఆ పాట చిత్రీకరణ పూర్తి అయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో పాల్గొనబోతున్నాడు. ఆ లోపు సినిమా విడుదల తేదీ దగ్గరకు వస్తుంది. దాంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నాడు.
‘వినయ విధేయ రామ’ చిత్రంతో వచ్చే సంక్రాంతి వరకు కూడా చరణ్ బిజీగానే గడుపబోతున్నాడు. ఈ గ్యాప్ లో మళ్లీ ఆర్ ఆర్ ఆర్ మల్టీస్టారర్ కు చరణ్ డేట్లు ఇవ్వలేదని తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత మళ్లీ జక్కన్న అండ్ ఎన్టీఆర్ లతో చరణ్ జాయిన్ కాబోతున్నాడు. అయితే ఎన్టీఆర్ మాత్రం పూర్తిగా జక్కన్నకే అంకితం అయ్యాడు. వినయ విధేయ కోసం బై బై చెప్పి - చిన్న బ్రేక్ తీసుకున్న చరణ్ సంక్రాంతి తర్వాత సినిమా పూర్తి అయ్యే వరకు జక్కన్నకు అందుబాటులో ఉండనున్నాడు. 2020లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలున్నాయి. ఇంకా ఈ చిత్రంలో నటించబోతున్న హీరోయిన్స్ విషయంలో జక్కన్న క్లారిటీ ఇవ్వలేదు.
No comments:
Post a Comment