బిగ్ బాస్ షో చిక్కుల్లో పడింది

Kamal-Haasan-Bigg-Boss-Tamil-2-into-trouble-Andhra-Telugu-Telugu.jpg

బిగ్ బాస్ షో చిక్కుల్లో పడింది

పోయినేడాది ముందుగా తమిళ ‘బిగ్ బాస్’ షో మొదలైన కొన్ని రోజులకు తెలుగు ‘బిగ్ బాస్’ మొదలైంది. ఈసారి ముందు తెలుగు ‘బిగ్ బాస్’ మొదలైతే.. తమిళ షో కొన్ని రోజులు లేటుగా ఆరంభమైంది. తెలుగు షోతో పోలిస్తే తమిళ ‘బిగ్ బాస్’ చాలా వివాదాలకు దారి తీసింది. ఒవియా ఉదంతం ఎంతటి కలకలం రేపిందో తెలిసిందే. ఈసారి కూడా కూడా తమిళ ‘బిగ్ బాస్’ ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘ఖుషీ’ భామ ముంతాజ్ లాంటి హాట్ బాంబ్ ఈసారి షోలో పాల్గొంటుండటం అక్కడి జనాల్లో క్యూరియాసిటీ తెస్తోంది. ఐతే ఈ షో ఆరంభంలోనే ఒక వివాదంలో చిక్కుకుంది. ఈ షో విషయంలో ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఫెఫ్సి) అభ్యంతరం వ్యక్తం చేసింది. తమిళ ‘బిగ్ బాస్’ షో కోసం 70 శాతం మంది ముంబయి వాళ్లే పని చేస్తున్నారని ఆ సంస్థ ఆరోపించింది.


స్థానిక నిబంధనల ప్రకారం 50 శాతానికి మించి బయటి వాళ్లు పని చేయడానికి వీల్లేదని.. ఐతే ఏకంగా 70 శాతం మంది ముంబయి వాళ్లను తెచ్చి ఈ షో కోసం పని చేయించుకుంటున్నారని.. దీని వల్ల స్థానికులకు అన్యాయం జరుగుతోందని ఆ సంస్థ ఆరోపించింది. గత ఏడాది కూడా ఇదే సమస్య తలెత్తిందని.. కమల్ హాసన్ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించారని.. కానీ ఈసారి కూడా నిబంధనల్ని అతిక్రమించి షో నిర్వాహకులు స్థానికేతరులతో ప్రొడక్షన్ వర్క్  చేయించుకుంటున్నారని.. ఇది ఆగకపోతే షోను ఆపేస్తామని ఆ సంస్థ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో షో నిర్వాహకులు ఏం చేస్తారు.. కమల్ ఎలా స్పందిస్తాడన్నది చూడాలి. తెలుగుతో పోలిస్తే ఈసారి తమిళ ‘బిగ్ బాస్’కే ఎక్కువ ఆదరణ కనిపిస్తోంది. ఇక్కడి పార్టిసిపెంట్లతో పోలిస్తే అక్కడి వారు జనాల్లో బాగా ఆసక్తి రేకెత్తిస్తున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...