సెట్ అవుతుందా చైతూ
మహానటి బయోపిక్ లో తాత ఎఎన్ఆర్ వేషం అనగానే నాగ చైతన్య చాలా ఆశించి ఉంటాడు కాని తన వరకు అంతగా వర్క్ అవుట్ కాలేదన్నది నిజం. సావిత్రి గారి ట్రాన్స్ లో పడిపోయిన ప్రేక్షకులు మిగిలిన ఏ పాత్రను అంతగా పట్టించుకోలేదు. దానికి తోడు చైతు చేసింది కూడా నాలుగైదు చిన్న సీన్లే కాబట్టి తాతగారి పాత్రలో మనవడిగా మెప్పించాడా లేదా అనే విషయం పెద్దగా చర్చకు రాలేదు. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు మరోసారి ఎఎన్ ఆర్ లా నటించాలనే ప్రతిపాదన నాగ చైతన్య వద్దకు వచ్చిందట. బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కోసం ప్రపోజల్ వచ్చినట్టు టాక్.ఎన్టీఆర్ నట జీవితంలో నాగేశ్వర్ రావు గారి పాత్ర చాలా ఉంది. ఇద్దరు కలిసి 14 మల్టీ స్టారర్ సినిమాల్లో నటించారు. అందులో ఒకటి రెండు తప్ప అన్ని బ్లాక్ బస్టర్స్. రామారావు గారు రాజకీయాల్లోకి రావాలి అనుకున్నప్పుడు సినిమా రంగం నుంచి ఆయన పిలిచింది ఇద్దరినే. ఒకరు నాగేశ్వర్ రావు గారు. మరొకరు కృష్ణగారు. వేర్వేరు కారణాల వల్ల ఇద్దరు సున్నితంగా తిరస్కరించారు. అది వేరే సంగతి.
No comments:
Post a Comment