Censor-Board-no-clearance-for-Modi-themed-feature-film-Andhra-Talkies |
అయితే.. ఈ చిత్రాన్ని సెన్సార్ చేసేందుకు సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈ చిత్ర విడుదలకు అవసరమైన సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేమని పేర్కొంది. ఎన్నికల కమిషన్ నుంచి సినిమా రిలీజ్ కు ఎలాంటి అభ్యంతరం లేదన్న పత్రాన్ని తీసుకొస్తే తాము చిత్ర విడుదలకు అనుమతి ఇస్తామని పేర్కొంది.
Read : ఇటు తెలుగు రాష్ట్రాలలోను, అటు అమెరికాలోనూ దుమ్ము దులిపేస్తున్న నాని సినిమా "నేను లోకల్"
ముంబయికి చెందిన వికాస్ మహంతను పలువురు ముంబయి మోడీగా అభివర్ణిస్తారు. అలాంటి వికాస్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ సినిమాకు సెన్సార్ కు బోర్డు నో చెప్పేసింది. 135 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్ర షూటింగ్ గత డిసెంబరులో పూర్తి చేశారు. ఈ చిత్ర ప్రీమియర్ షోను ప్రధాని మోడీకి చూపించాలని భావిస్తున్నట్లుగా నిర్మాత ఝూ చెబుతున్నారు. స్మార్ట్ సిటీలను నిర్మించాలన్న మోడీ స్వప్నాన్ని ఆవిష్కరించే లక్ష్యంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రధానిని ఎలివేట్ చేసేలా తీసిన సినిమాకు సెన్సార్ చిక్కులు ఎదురుకావటం చూస్తే.. చట్టం తన పని తాను చేస్తున్నట్లుగా చెప్పక తప్పదేమో.
Read : Hot Images for TV Anchor Anasuya | Andhra talkies Gallery