![]() |
Samantha-and-Naga-Chaitanya-Highlight-Couple-for-this-Valentines-day |
ఏం మాయ చేశావే అంటూ మొదలైన వీరి ప్రయాణం.. తర్వాత ఒకరినొకరు మాత్రం మాయ చేసుకోలేదు. స్నేహం మాత్రమే చేశారు. అదే వీరి ప్రేమకు పునాది. అసలు తమ ప్రేమ ఎప్పుడు మొదలైందో కూడా తెలీదని చెప్పేస్తారు ఈ ఇద్దరు. ప్రేమగా మారిన స్నేహంలో అంతగా మునిగి తేలారన్న మాట. ఈ విషయంలో చైతు కాస్త గుంభనంగా ఉన్నా.. సమంత మాత్రం అప్పుడప్పుడు కొన్ని క్లూస్ ఇస్తూనే ఉంది. ఇండస్ట్రీలో తనకు బాగా నచ్చిన వ్యక్తి చైతు అని.. చైతుకి జోడీ నటించడాన్ని ఎంజాయ్ చేస్తానని ఇంటర్వ్యూలలో చెప్పేది. కానీ ఎవరూ ఆ పాయింట్ ని క్యాచ్ చేయలేకపోయారంతే.
ఒకరి కష్టకాలంలో మరొకరు తోడు ఉండడం.. ఒకరి విజయాలను మరొకరు ఎంజాయ్ చేయడం.. అబ్బాయి-అమ్మాయి మధ్య బంధం ధృడమయ్యేందుకు అంతకంటే ఎక్కువ కావాలి. పైగా వీళ్ల లవ్ స్టోరీలో విలన్స్ ఎవరూ లేరు కూడా. ప్రేమపై వీళ్లు క్లారిటీ తెచ్చుకుని ఇంట్లో చెప్పగానే.. వాళ్ల సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిసింది. మరి ఈ వేలంటైన్స్ డేకి.. తన ప్రియురాలికి ఏం గిఫ్ట్ ఇస్తున్నావని చైతుని అడిగితే ఏమన్నాడో తెలుసా?
'ప్రేమే ఒక పెద్ద బహుమతి. అలాంటప్పుడు వేరే బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడంపై నాకు నమ్మకం లేదు' అన్నాడు చైతు. సమంత అయితే 'నా దృష్టిలో ప్రేమ అంటేనే చెయ్' అని చెప్పింది సమంత. ఇంతగా ఒకరినొకరు అర్ధం చేసుకున్నాక.. ఈ వేలంటైన్స్ డేకి హైలైట్ కపుల్ గా వీళ్లిద్దరిని చెప్పుకోవాల్సిందే.