‘గరుడ వేగ’ సినిమాకు హాలీవుడ్ టెక్నీషియన్స్

Rajasekhar-Garuda-Vega-for-Hollywood-Cinematographers-Andhra-talkies
పూర్తిగా వరుస ఫ్లాపులతో  ఫాలోయింగ్ కోల్పోయిన రాజశేఖర్.. ‘గరుడ వేగ’ సినిమాతో కొంత మేర జనాల దృష్టిని ఆకర్షించగలిగాడు. ఎల్బీడబ్బ్యూ.. గుంటూరు టాకీస్ లాంటి సినిమాలతో యువ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం ఇందుకు ఓ కారణం. గత దశాబ్ద కాలంలో రాజశేఖర్ మార్కెట్ బాగా దెబ్బ తిన్నప్పటికీ.. అదేం పట్టించుకోకుండా  ఈ చిత్రం మీద ఏకంగా రూ.25 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్లుగా నిర్మాత కోటేశ్వర్ రాజు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఊరికే గొప్పలు చెప్పుకోవడానికి పాతిక కోట్ల బడ్జెట్ అని ప్రకటన ఇచ్చినట్లు కూడా లేదు. ఈ సినిమా కోసం దాదాపు 40 రోజులు జార్జియాలో షూటింగ్ చేయడం విశేషం.

ఐతే ఈ చిత్ర బృందం జార్జియాకు బయల్దేరి వెళ్లాక సినిమాటోగ్రాఫర్ తండ్రి తీవ్ర అనారోగ్యం పాలవడంతో వెనక్కి వచ్చేశాడట. అప్పటికప్పుడు మరో సినిమాటోగ్రాఫర్ అందుబాటులో లేకపోవడంతో హాలీవుడ్ సినిమాలకు పని చేసిన జికా చెలిజ్.. బకుర్ చికొబావా అనే ఇద్దరు ఫ్రెంచ్ సినిమాటోగ్రాఫర్ల సేవల్ని ‘గరుడ వేగ’ కోసం ఉపయోగించుకున్నాడట దర్శకుడు ప్రవీణ్ సత్తారు. వాళ్ల సహకారంతో తెరకెక్కించిన యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చాయని.. జార్జియా ఎపిసోడ్ వరకు ‘గరుడ వేగ’ హాలీవుడ్ లుక్ లో కనిపిస్తుందని అంటున్నాడు ప్రవీణ్. ఈ సినిమాటోగ్రాఫర్ల కోసం నిర్మాత కొంచెం భారీగానే చెల్లించుకోవాల్సి వచ్చిందట. ఈ చిత్రంలో రాజశేఖర్ సరసన ‘విశ్వరూపం’ ఫేమ్ పూజా కుమార్ కథానాయికగా నటిస్తుండగా.. కిషోర్ విలన్ రోల్ చేస్తున్నాడు. ఆగస్టులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది...Read More

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...