హీరో హీరోయిన్లను కలిపిన తెలివైన నిర్మాత!

Star-Producer-Behind-Hero-Heroine-Patchup-Andhra-Talkies

హీరో హీరోయిన్లను కలిపిన తెలివైన నిర్మాత!

ఆయన మీడియం రేంజ్ హీరోలలో టాప్. ఆయనతో కలిసి ఓ సూపర్ టాలెంటెడ్ హీరోయిన్ ఒక సినిమాలో నటించింది. ఆ సూపర్ టాలెంటెడ్ హీరోయిన్ చేసేవే తక్కువ సినిమాలు. తూతూమంత్రం పాత్రలను అసలు ఒప్పుకోదు. పైగా స్ట్రాంగ్ లేడీ అని కూడా టాక్ ఉంది. ఈ హీరోయిన్ కు.. అ హీరోకు షూటింగ్ సమయం లో ఈగో క్లాషెస్ వచ్చాయిని ఎడమొహం పెడమొహంగా ఉంటూ ఫిలిం యూనిట్ ను ఏడిపించారని టాక్ ఉంది. అయితే ఆ సినిమాను నిర్మించిన వ్యక్తి ఓక స్టార్ ప్రొడ్యూసర్.. ఆయన ముదుర్లకే ముదురు మహాముదురు కావడంతో ఇద్దరికి అయన శైలిలో నచ్చజెప్పి రాజీ కుదిర్చి సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమా మూడేళ్ళ క్రితం రిలీజ్ అయింది. సూపర్ హిట్ గా నిలిచింది.

ఇదిలా ఉంటే ఆ హీరోయిన్ ఇకపై ఆ హీరోతో నటించదని అందరూ అనుకున్నారు. కానీ మనం అనుకున్నవి జరగకపోవడం.. అనుకోనివి జరగడమే జీవితం. ఇప్పుడు అలానే జరిగిందట. ఆ సినిమా తర్వాత ఆ హీరోయిన్ కు ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు. కెరీర్ చాలా డల్లుగా సాగుతోంది. ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ స్టార్ హీరోయిన్ కాలేక పోయింది. చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. ఈ సమయంలో ఆ ముదురు ప్రొడ్యూసర్ ఒక ప్రాజెక్ట్ సెట్ చేశాడట. ఆ హీరో ఈ హీరోయిన్ ను జోడీగా ఒప్పించాడట. అసలు ఆ హీరో హీరోయిన్ కలిసి నటించడం అనేది అసాధ్యం అని వాదించిన వ్యక్తులు ఇప్పుడు ఈ ప్రాజెక్టు గురించి తెలిసి ముక్కున వేలేసుకుంటున్నారు.



నిర్మాత ఆలోచన ఏంటంటే హీరో హీరోయిన్లది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదని టాక్ ఎలాగూ ఉంది కాబట్టి బోల్డంత పబ్లిసిటీ. పైసా ఖర్చు లేకుండా మీడియానే ఉత్సాహంగా వార్తలు రాసి మరీ ఆ సినిమాకు ప్రచారం కల్పిస్తుందని స్కెచ్ వేశారట. సూపర్ ఐడియా కదా?

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...