రూపాయికి రూపాయి లాభం ఎక్కడండీ!

Director-Anil-Ravipudi-On-About-Sarileru-Neekevvaru-Movie-Andhra-Talkies

రూపాయికి రూపాయి లాభం ఎక్కడండీ!

సంక్రాంతి బరిలో రిలీజైన చిత్రాల్లో `అల వైకుంఠపురములో` క్లీన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే సంక్రాంతి సెలవుల్ని క్యాష్ చేసుకోవడంలో సరిలేరు నీకెవ్వరు ప్రతాపం చూపించింది. కంటెంట్ వీక్ అని క్రిటిక్స్ తేల్చేసినా పండగ సెలవులు ఈ సినిమాని 100 కోట్ల షేర్ వరకూ లేపాయని ట్రేడ్ విశ్లేషించింది. అయినా కొన్నిచోట్ల డెఫిషిట్ పడిందన్న టాక్ కూడా వినిపించింది. 50 డేస్ బ్లాక్ బస్టర్ కా బాప్! అంటూ నేడు కొత్త పోస్టర్ వేసి సరిలేరు టీమ్ పండగ చేసుకోవడం మరోసారి చర్చకు వచ్చింది. ఎన్ని థియేటర్లలో ఆడిందో పోస్టర్ పై  మాత్రం వేయలేదు.



ఇక దీనిపై దర్శకుడు అనీల్ రావిపూడి ఎగ్జయిట్ మెంట్ చూసిన వారికి ఔరా! అనిపించక మానదు. అతడు ఈసారి ఏకంగా పోయెటిక్ గానే ఎగ్జయిట్ మెంట్ ప్రదర్శించాడు. ``బాధ అయినా గాయం అయినా తట్టుకునే శక్తి ఆడవాళ్లకు మాత్రమే ఉంది. అందుకేనేమో దేశాన్ని అమ్మతో పోల్చుతారు....``.. ఇలాంటి డైలాగ్ లను హృదయ పూర్వకంగా ప్రశంసించారు మీరు అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. ``సరిలేరు నీకెవ్వరు ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించేలా చేశారు. పంపిణీదారులు పెట్టిన ప్రతి రూపాయికి రూపాయి లాభం వచ్చింది. నిర్మాత లాభాల్ని బాగా ఎంజాయ్ చేశారు. నా హీరో ఎంతో నమ్మకం పెట్టుకుని నటించారు. నన్ను గర్వంగా కౌగిలించుకుని ఆనందం వ్యక్తం చేశారు. మర్చిపోలేని సంక్రాంతిని నాకు ఇచ్చారు. ప్రేక్షకులూ సరిలేరు మీకెవ్వరూ!! `` అంటూ అనీల్ రావిపూడి ఎగ్జయిట్ అయ్యాడు.

అయితే అనీల్ మరీ ఇంత ఎమోషనల్ అయ్యాడెందుకో. 2019 సంక్రాంతి బరిలో ఎఫ్ 2 ని క్లీన్ బ్లాక్ బస్టర్ అన్నారు కానీ.. 2020 సంక్రాంతి బరిలో ట్రేడ్ ఎక్కడా ప్రశంసించలేదు. పైగా తెలుగు స్టేట్స్ లో నాన్ బాహుబలి రికార్డ్ అంటూ డబ్బా కొట్టుకోవడంపైనా తీవ్ర విమర్శలే చెలరేగాయి. కలెక్షన్లు ఫర్వాలేదు కానీ ఇండస్ట్రీ రికార్డుల సీన్ లేదన్న వాదనా వినిపించింది. పంపిణీదారులకు రూపాయికి రూపాయి వచ్చిందంటే సంతోషమే కానీ... మరీ ఇంతగా ఎగ్జయిట్ అవ్వాలా? అన్నదే క్వశ్చన్ చేస్తున్నారు. ఇక ఇలాంటి వాటిపై కంటే కంటెంట్ పరంగా స్క్రిప్టు డిపార్ట్ మెంట్ ని తీర్చిదిద్దితేనే లాంగ్ టైమ్ మనుగడ అని కూడా కొందరు ముక్తాయిస్తున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...