![]() |
ఎవరీ చిట్టిబాబు 2.0 ఏమిటా విలాసం? |
ఎవరీ చిట్టిబాబు 2.0 ఏమిటా విలాసం?
చిట్టిబాబు కూల్ హ్యాబిట్స్ గురించి ఎందరికి తెలుసు? అతడు పెద్ద స్టార్ అని మాత్రమే అభిమానులకు తెలుసు. అంతకుమించి అతడు ప్రకృతి ప్రేమికుడు. అలాగే మూగ జీవాల విషయంలో చరణ్ కి ఉండే ఆప్యాయత అంతా ఇంతా కాదని సన్నిహితులు చెబుతుంటారు. తన అభిరుచి మేరకు వైల్డ్ లైఫ్ సాంక్చువరీని ప్రారంభించారు. అది కూడా తన ఇంటి పరిసరాల్లోనే దీనిని ఏర్పాటు చేయడం ఆ స్పాట్ ని టాలీవుడ్ స్టార్లు విజిట్ చేయడం తెలిసిందే.ఇకపోతే చరణ్ ఇంట్లో పెట్ డాగ్స్ గురించి బయటకు తెలిసింది తక్కువే. ఇంట్లో ఉన్నప్పుడు జాగింగ్ కి వెళ్లేప్పుడు చరణ్ తనతో పాటే పెట్ డాగ్స్ ని వెంట తీసుకెళుతుంటారట. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగైదు పెట్ డాగ్స్ తనతో పాటే ఉంటాయి. ఇక వీటికి చరణ్ పర్సనల్ స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేసే అనుమతి ఉందట. వాటితో పాటే చరణ్ కూడా ఈత కొడుతూ ఆస్వాధించే ఫోటోలు వీడియోలు ఇప్పటికే యూట్యూబ్ లో కోకొల్లలు. ఇక పెట్స్ లో రకరకాల బ్రాండ్లు చెర్రీ ఇంట దర్శనమిస్తుంటాయి.
ఇంతకుముందు రంగస్థలం చిట్టిబాబు గా గెటప్ ఛేంజ్ చేసినప్పుడు పెట్ డాగ్స్ తో ఇచ్చిన ఫోజులు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. తాజాగా మరోసారి పొట్టి పెట్ డాగ్ తో చెర్రీ అలియాస్ చిట్టిబాబు ఇచ్చిన ఫోజు ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. తెల్ల పంచె.. తెల్ల లాల్చీలో కనిపించిన చరణ్ ఎంతో ఆప్యాయంగా తన పెట్ డాగ్ ని చేతుల్లోకి తీసుకుని లాలిస్తున్నారు. ఇంతకీ దీని పేరేమిటి? అంటే చిట్టిబాబు 2.0 అంటూ అభిమానులు ముద్దుగా పిలిచేస్తున్నారు మరి. చరణ్ కెరీర్ పరంగా ఫుల్ బిజీ. ఓవైపు హీరోగా.. మరోవైపు నిర్మాతగానూ అతడు బిజీ. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణలో పాల్గొంటున్న చరణ్ మరోవైపు డాడ్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య (చిరు 152) నిర్మాతగానూ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. తీరిక సమయాల్ని ఇదిగో ఇలా రిలాక్స్ అవుతున్నారన్నమాట.
No comments:
Post a Comment