అయ్యో అవన్నీ పుకార్లేనా?
![]() |
అయ్యో అవన్నీ పుకార్లేనా? |
మాస్టర్ చిత్రం తర్వాత విజయ్ చేయబోతున్న సినిమా దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ సినిమా ఉండబోతుందని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. విజయ్ కూడా మురుగదాస్ కే ఓటు వేయాలని భావిస్తున్నట్లుగా తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పిన విషయాన్ని బట్టి అర్థం అవుతోంది.
వీరిద్దరి కాంబోలో ఇప్పటికే తుపాకి.. కత్తి.. సర్కార్ చిత్రాలు చేశారు. మూడు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. అందుకే వీరిద్దరి కాంబోలో మరో సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక దర్శకుడు మురుగదాస్ ప్రస్తుతం కాస్త ఇబ్బందుల్లో ఉన్నాడు. ఆ కారణంగానే విజయ్ కూడా ఆయనకు ఛాన్స్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. మాస్టర్ విడుదలకు ముందే వీరిద్దరి కాంబోలో మూవీ ప్రారంభం అయ్యే అవకాశం ఉందట. మరి మన దర్శకురాలు సుధ కొంగరకు విజయ్ ఛాన్స్ ఇవ్వనట్లేనా అనేది తెలియాల్సి ఉంది.
No comments:
Post a Comment