ఏప్రిల్ లో అయినా థియేటర్స్ తెరుచుకుంటాయా...?


ఏప్రిల్ లో అయినా థియేటర్స్ తెరుచుకుంటాయా...?

Are-Theaters-Will-Open-In-April-Andhra-Talkies
ఏప్రిల్ లో అయినా థియేటర్స్ తెరుచుకుంటాయా...?
కరోనా మహమ్మారి ఎఫెక్ట్ వల్ల దేశ వ్యాప్తంగా మల్టీ ఫ్లెక్సులు థియేటర్స్ మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో కొన్ని వందల కోట్ల మేర నష్టాలు చవిచూసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. నిర్మాతల మండలి సూచన మేరకు చిత్ర పరిశ్రమ కార్యకలాపాలు నిలుపుదల చేసుకున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న చిత్రాలు తమ షూటింగ్ లను నిలుపుదల చేసుకోగా రిలీజ్ కు సిద్ధంగా ఉన్న చిత్రాలు తమ రిలీజ్ డేట్స్ మార్చుకుంటున్నాయి. మన దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులలో గణనీయమైన క్షీణత వచ్చేవరకు ప్రచార కార్యక్రమాలు కూడా నిలిపి వేశారు. కరోనా పరిస్థితులు మారేలా కనిపించకపోవడం తో మార్చి 25న రిలీజ్ కావాల్సిన చిత్రాలు ఏప్రిల్ నెలకు పోస్ట్ పోన్ అయ్యాయి. కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తన ప్రభావాన్ని తగ్గించుకునేలా కనబడకపోవడం తో ఏప్రిల్ మొదటి వారంలో విడుదల కానున్న సినిమాలను కూడా తరువాతి వారాలకు వాయిదా వేయబోతున్నట్లు ప్రకటించాయి.



అయితే ఇప్పుడు పరిస్థితులు చూస్తే ఏప్రిల్ లో కూడా థియేటర్స్ తెరుచుకునేలా కనిపించడంలేదు. ఒకవేళ ఓపెన్ చేసినా విడుదలకు నోచుకోని చిన్నా చితక సినిమాలన్నీ ఒకేసారి క్యూ కట్టే అవకాశం ఉంది. దీని వల్ల ఏ సినిమా కూడా లాంగ్ రన్ సాధించే అవకాశమే లేదు. దీంతో ఇండస్ట్రీకి పెద్ద నష్టం జరిగే ఛాన్స్ ఉంది. అనుష్క నటించిన 'నిశ్శబ్దం' మైత్రీ మూవీ మేకర్స్ వారి 'ఉప్పెన' నాని - సుధీర్ బాబు నటించిన 'వి' రాజ్ తరుణ్ 'ఒరేయ్ బుజ్జిగా' లాంటి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. నిర్మాతలు ఎక్జిబ్యూటర్లు పంపిణీదారులు ఈ నెలాఖరున పరిస్థితులను బట్టి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా కరోనా ఎఫెక్ట్ వల్ల టాలీవుడ్ కు కొన్ని వందల కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...