ఇండియన్ సినిమాలకు అక్కడ గేట్లు మూసేశారు


ఇండియన్ సినిమాలకు అక్కడ గేట్లు మూసేశారు

Gates-Are-Closed-For-Indian-Movies-Andhra-Talkies
ఇండియన్ సినిమాలకు అక్కడ గేట్లు మూసేశారు
కరోనా ధాటికి కుదేలవుతున్న రంగాల్లో సినీ పరిశ్రమ ఒకటి. మిగతా రంగాల కంటే ముందు దీనిపైనే కరోనా ప్రభావం పడింది. నెల కిందట్నుంచే సినిమాల వసూళ్లు పడిపోయాయి. తర్వాత ఏకంగా థియేటర్లే మూసేశారు. షూటింగులు ఆగిపోయాయి. రిలీజ్లు ఆగిపోయాయి. మళ్లీ ఎప్పుడు థియేటర్లు తెరుచుకుంటాయో తెలియట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ నెలాఖరు వరకు థియేటర్లను మూసేశారు. ఏప్రిల్ మొదటి వారంలోనూ థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఆ నెల రెండో అర్ధంలో అయినా పరిస్థితి మారుతుందేమో అని చూస్తున్నారు. ఇండియా లో కరోనా ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. కనీసం మే ఆరంభం నుంచి అయినా సాధారణ పరిస్థితులు నెలకొంటాయని.. వేసవిలో అత్యంత ముఖ్యమైన ఈ నెలలో అయినా వసూళ్ల పంట పండించుకోవచ్చని భావిస్తున్నారు.



కానీ విదేశాల్లో పరిస్థితులు దారుణంగా తయారవడం తో పలు దేశాలు ఇక్కడి నుంచి ఎనిమిది వారాల పాటు థియేటర్లు మూసేస్తున్నట్లు ప్రకటించాయి. అందులో ఆస్ట్రేలియా యూకే లాంటి ఇండియన్ సినిమాలకు మంచి మార్కెట్ ఉన్న దేశాలున్నాయి. యుఎస్లో కూడా వచ్చే రెండు నెలలు థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేదు. ఇండియన్ సినిమాలకు కొన్నేళ్లుగా విదేశీ వసూళ్లు ఎంత కీలకంగా మారాయో తెలిసిందే. మొత్తం వసూళ్లలో 25 శాతానికి పైగా అవే ఉంటున్నాయి. అంత ఆదాయాన్ని వదులుకుని సినిమాలు రిలీజ్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి మన దగ్గర పరిస్థితులు మారినా.. విదేశాల్లో థియేటర్లు తెరుచుకోని పరిస్థితుల్లో పేరున్న సినిమాల్ని రిలీజ్ చేసే సాహసం చేయకపోవచ్చు. కాబట్టి జూన్లో కానీ థియేటర్లు తెరుచుకోవడం సినిమాలు రిలీజ్ కావడం సాధ్యం కాకపోవచ్చు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...