సీనియర్ నటి రమ్యకృష్ణపై రకరకాల రూమర్లు..!

Speculations-on-About-Most-Powerfull-Heroin-Ramya-Krishna-movie-Offers-in-Telugu-Film-Industry-Andhra-Talkies
గత కొంతకాలంగా సీనియర్ నటి రమ్యకృష్ణపై రకరకాల రూమర్లు పుట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత రమ్యకృష్ణ రేంజు అమాంతం మారిపోయింది. మోస్ట్ పవర్ ఫుల్ శివగామి పాత్రలో నటించాక తన ఇమేజ్ పదింతలైంది. అందుకు తగ్గట్టే వరుస అవకాశాలతో భారీగా ఆర్జిస్తోందని ప్రచారమవుతోంది. అయితే ఇదంతా నిజమే కానీ.. ప్రస్తుతం రమ్యకృష్ణ కెరీర్ పరంగా ఫలానా సినిమా చేస్తున్నారు? అన్న దానిపై స్పష్టమైన క్లారిటీ అయితే లేదు.

అప్పట్లో శివగామి పాత్రకు కొనసాగింపుగా ఫిక్షన్ కథతో తీస్తున్న సినిమాలో  నటిస్తున్నారని పోస్టర్లు రివీలయ్యాయి. ఆ సినిమా రిలీజ్ కి రాలేదింకా. ఈలోగానే రమ్యకృష్ణ నటించిన పలు తమిళ చిత్రాలు రిలీజై వెళ్లాయి. ఇప్పుడు టాలీవుడ్ లోనూ క్షణం తీరిక లేనంతగా వరుసగా సినిమాలకు కమిటవుతున్నారని ప్రచారమవుతోంది. పైగా తెలుగు ఫిలిం సర్కిల్స్ లో రమ్య రెగ్యులర్ గా ప్రత్యక్షమవుతుండడంతో చెన్నయ్ వదిలిన రమ్యకృష్ణ ఇక్కడ మరోసారి పూర్తిగా బిజీ అయిపోతోందంటూ ప్రచారం మొదలైంది.



భర్త కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రాజ మార్తాండ చిత్రంలో రమ్యకృష్ణ నటిస్తున్నారని .. దాంతో పాటు వరుణ్ తేజ్ కు తల్లిగా నటించేందుకు సంతకం చేసారని ఈ చిత్రంలో మాధవన్ తండ్రి పాత్రలో నటిస్తున్నారని ప్రచారమైంది. అయితే అది రూమర్ అని మాధవన్ ఇటీవల వెల్లడించారు. ఇకపోతే పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఫైటర్ లో ఓ కీలక పాత్రకు రమ్యకృష్ణ సంతకం చేశారని ప్రచారమవుతోంది. విజయ్ దేవరకొండ సరసన ఇందులో నిధి అగర్వాల్ నటించే వీలుంది. అయితే వీటికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడ లేదు. ఈలోగానే రమ్యకృష్ణ నేరుగా గోవాలో పూరి- ఛార్మి బృందంతో భేటీ అయ్యి కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. రమ్యకృష్ణ కేవలం ఫైటర్ లో మాత్రమే కాదు.. ఇప్పుడు ఆకాష్ పూరి నటిస్తున్న రొమాంటిక్ లోనూ నటిస్తున్నారు అంటూ మరో ప్రచారం మొదలైపోయింది. అయితే ఇది నిజమా? అంటే ఇవేవీ నిజాలు కావు. కేవలం పుకార్లు మాత్రమే. ఏదో ఫోటో ఆధారిత ప్రచారం తప్ప వాస్తవం ఏమిటి? అన్నది రమ్యకృష్ణనే చెప్పాల్సి ఉంటుంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...