వివాదాస్పద నటి పాత్రలో శ్రీరెడ్డి!

Sexy-Actor-Sree-Reddy-In-Shocking-Role-Andhra-Talkies
టాలీవుడ్ నటి శ్రీరెడ్డి పేరు తెలియని తెలుగువారు దాదాపుగా ఉండకపోవచ్చు.  క్యాస్టింగ్ కోచ్ ఆరోపణలు చేసి మీడియా దృష్టిని.. ప్రజల ఆకర్షించిన శ్రీరెడ్డి ఫిలిం ఛాంబర్ వద్ద అర్థనగ్న ప్రదర్శనతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది.  అయితే అప్పటి నుంచి తెలుగులో శ్రీరెడ్డికి అవకాశాలు రాలేదు. ఒకరిద్దరు అవకాశాలు ఇస్తామని పబ్లిక్ గా ప్రకటించారు కానీ వాటిసంగతి ఏమైందో తెలియదు.

తాజాగా శ్రీరెడ్డికి 'క్లైమాక్స్' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో ఒక అవకాశం దక్కింది. తెలుగు రాజకీయాలపై ఒక సెటైర్ లాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీరెడ్డి ఒక వివాదాస్పద నటి పాత్రలో నటిస్తోందని సమాచారం.  ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్.. పృథ్విరాజ్.. శివశంకర్ మాస్టర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  రీసెంట్ గా 'క్లైమాక్స్' టీమ్ కొన్ని స్టిల్స్ విడుదల చేసింది.  ఈ ఫోటోలలో శ్రీరెడ్డి ఎప్పటిలాగే గ్లామరస్ గా కనిపిస్తోంది.  ఈ స్టిల్ లో 30 ఇయర్స్ పృథ్వి ఒక స్వామీజీ గెటప్ లో ఉన్నారు.   రాజేంద్ర ప్రసాద్ పొడవాటి గడ్డం పెంచి మోడరన్ గెటప్ లో ఉన్నారు.



మరి ఈ సినిమాతో అయినా శ్రీరెడ్డికి టాలీవుడ్ లో మంచి బ్రేక్ దక్కుతుందా అనేది వేచి చూడాలి. ఏదేమైనా శ్రీరెడ్డి నటిగా తన టాలెంట్ ను మరోసారి నిరూపించుకునేందుకు ఇదో చక్కని అవకాశం అనే చెప్పాలి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...