నాని పేరు చెప్పిన దొరసాని!

Shivatmika-Likes-Nani-andhra-talkies
సాధారణ ప్రేక్షకులైనా స్టార్ కిడ్స్ అయినా ఏదో ఒక హీరోనో హీరోయిన్ నో అభిమానించడం కామన్. ఒక్కోసారి  కొంతమంది సెలబ్రిటీలతో ప్రేమలో కూడా పడిపోతుంటాం.  మరీ ప్రేమ అనే పదం వాడితే పెద్దదైపోతుందేమో కానీ దాన్ని క్రష్ అనుకోవచ్చు.  రీసెంట్ గా తమ క్రష్ గురించి కొత్త హీరో హీరోయిన్లు ఆనంద్ దేవరకొండ - శివాత్మిక రాజశేఖర్ జోడీ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

త్వరలో రిలీజ్ కానున్న 'దొరసాని' చిత్రంతో ఆనంద్ దేవరకొండ - శివాత్మిక రాజశేఖర్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారనే సంగతి తెలిసిందే.  దీంతో ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.  రీసెంట్ గా అలాంటి ఒక ఇంటర్వ్యూలో ఆనంద్ దేవరకొండ ను తన క్రష్ గురించి చెప్పమంటే తడుముకోకుండా బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే పేరు చెప్పాడు.  శివాత్మిక మాట్లాడుతూ కనీసం ఒక అరడజను పేర్లు చెప్పింది.  రణబీర్ కపూర్.. విక్కీ కౌశల్.. రణవీర్ సింగ్.. ఆదిత్య కపూర్ అంటే ఇష్టమని చెప్పింది.  టాలీవుడ్ లో దాదాపు అందరూ సెలబ్రిటీలు తనకు పరిచయం ఉండడంతో క్రష్ లేదని తెలిపింది.


అయితే న్యాచురల్ స్టార్ నాని అంటే లవ్ అని చెప్పింది.  అది క్రష్ కాదని.. నాని నటన అంటే తనకు చాలా ప్రేమ అని చెప్పింది. అంతే కాదు.. ఎన్టీఆర్ యాక్టింగ్ ను చూసినా మతిపోతుందని చెప్పింది.  ప్రేమలో పడడం గురించి మాట్లాడుతూ ఎవరైనా ఒకరితో లవ్ లో పడడం అనేది ఎలా ఉంటుందో ఆలోచించలేకపోతున్నానని తెలిపింది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...