మరో మగాడిని పెళ్లి చేసుకునేందుకు అమెరికా వెళ్ళిన వైభవ్!

indian-gay-couple-marries-in-greece-andhra-talkies
పెళ్లికి అర్థం - పరమార్థం రెండూ మారిపోతున్నాయి. ఆడామగను సంసార బంధంతో ముడివేసి మానవజాతి మనుగడ కొనసాగేలా చేసేదే పెళ్లి. కానీ.. మారిన కాలంలో మానవజాతి మనుగడకు పెళ్లి అవసరమూ లేదు.. అసలు పెళ్లికి ఆడామగా కూడా అవసరం లేదనేలా ప్రపంచవ్యాప్తంగా విపరీతాలు చోటుచేసుకుంటున్నాయి. ఇద్దరు ఆడవాళ్లు పెళ్లి చేసుకోవడం.. ఇద్దరు పెళ్లి చేసుకోవడం వంటివి అనేక దేశాల్లో చూస్తున్నాం. అయితే.. ఇదంతా అలాంటి ఆలోచనలున్న మనుషుల మధ్యనో... లేదంటే అందుకు అనుమతించే దేశాల్లో అధికారుల ముందో జరుగుతున్నాయి. కానీ.. అమెరికాలో ఇద్దరు ప్రవాస భారతీయ పురుషులు మాత్రం రెండు కుటుంబాల అంగీకారంతో - బంధుమిత్రుల మధ్య అంగరంగ వైభోగంగా పెళ్లి చేసుకున్నారు.

టెక్సాస్ లో ఉంటున్న ఈ ఎన్నారైలు జైన సంప్రదాయంలో చాలా గ్రాండ్ గా తమ వివాహాన్ని జరుపుకున్నారు. ఈ జంటలో వైభవ్ అనే వ్యక్తి గే వివాహం కోసమే అమెరికాకు వెళ్లగా.. మరో భాగస్వామి పరాగ్ మెహతా అమెరికాలోనే పుట్టి పెరిగిన వ్యక్తి. వైభవ్ ఇండియా నుంచి 2011లో అమెరికా వెళ్లాడు. అక్కడి అమెరికన్ ఇన్ స్టిట్యూట్ ఫర్ రీసర్చ్ లో రీసర్చ్ అసోసియేట్ గా పనిచేస్తున్నాడు.


తాను గే అని తెలిసి ఎందరో ఎగతాళి చేసేవారని - ఇండియాలో ఉన్నప్పుడు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని తన ఆవేదనను వ్యక్తం చేశాడు. సరిగ్గా తనలానే ఆలోచించే పరాగ్ మెహతా తనకు అమెరికాలో పరిచయం అయ్యాడని ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి పీటలు ఎక్కామన్నాడు. భారత్ లో సెక్షన్ 377 అనే చట్టం కారణంగా హోమో సెక్సువాలిటీ నేరం కావడంతో తాను అమెరికా వచ్చేసి జంటను వెతుక్కున్నానని వైభవ్ చెబుతున్నాడు.

పరాగ్ మెహతా ప్రస్తుతం మాస్టర్ కార్డ్ సంస్థలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాడు. యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ కు సీనియర్ అడ్వైజర్ గానూ పనిచేస్తున్నాడు. అయితే.. వీరి పెళ్లి రెండు కుటుంబాలూ ఆమోదం తెలపడంతో పాటు వైభవంగా జరిపించారు. బంధుమిత్రులంతా హాజరయ్యారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...