ప్రభాస్ చొరవతో ఛాన్స్ దక్కించుకున్న దర్శకుడు!
 |
ప్రభాస్ చొరవతో ఛాన్స్ దక్కించుకున్న దర్శకుడు! |
బాహుబలి చేస్తున్న సమయంలో సుజీత్ తో సినిమాకు ప్రభాస్ కమిట్ అయ్యాడు. దాదాపు మూడు సంవత్సరాల పాటు ప్రబాస్ కోసం వెయిట్ చేయడంతో పాటు రెండు సంవత్సరాల పాటు సాహో చిత్రాన్ని సుజీత్ తెరకెక్కించాడు. అంటే సాహో చిత్రం కోసం తన కెరీర్ లో దాదాపు అయిదు సంవత్సరాలను సుజీత్ ఖర్చు చేశాడు. సాహో చిత్రం సౌత్ లో కాస్త అటు ఇటు అయినా బాలీవుడ్ లో మాత్రం ప్రభాస్ కు మంచి పేరు తెచ్చి పెట్టింది. బాహుబలితో వచ్చిన పేరును మరింతగా పెంచడంలో సాహో కీలకంగా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
సాహో వంటి మంచి సినిమాకు తనకు ఇచ్చిన సుజీత్ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ప్రభాస్ సాయం చేశాడు. సుజీత్ వద్ద ఉన్న ఒక కథ నచ్చడంతో తన హోం బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ లో దాన్ని నిర్మించేందుకు వంశీ మరియు ప్రమోద్ లను ఒప్పించాడు. దాంతో పాటు శర్వానంద్ మరియు గోపీచంద్ లను ఈ చిత్రంలో నటించేందుకు ఒప్పించాడట. గోపీచంద్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ లో రూపొందబోతున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో శర్వానంద్ గెస్ట్ గా కనిపించబోతున్నాడట. ఈ కాంబో సెట్ అవ్వడానికి పూర్తి కారణం ప్రభాస్ అంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.