![]() |
నటన విరమించాక ఫుల్ టైమ్ డాక్టర్!-సాయిపల్లవి |
హీరోయిన్ అయ్యి ఓ వెలుగు వెలిగింది కాబట్టి ఇక నటనలోనే కొనసాగాలని పూర్తిగా నిర్ణయించుకుందట. ఆసక్తి రేకెత్తించే పాత్రలు ఏవి వచ్చినా నటించేస్తాను. ఎంత కాలం ఉండాలనిపిస్తే అంత కాలం ఇదే వృత్తిలో కొనసాగుతాను. నటనలో ఉన్నంత మాత్రాన వైద్య వృత్తిని వదిలిపెట్టను. అలాగని నటిస్తూ వైద్యం చేయను. నటన నుంచి పూర్తిగా విరమించుకున్న తర్వాత మాత్రం పూర్తి స్థాయి డాక్టర్ గా మారి ప్రజలకు వైద్యం అందిస్తాను. మన దేహాన్ని మనం గౌరవించాలి. ఆరోగ్యం విషయంలో ఎవరికి వారు పూర్తి బాధ్యత తీసుకుని కాపాడుకోవాలి!! అన్న ధ్యాసను ప్రజల్లో పెంపొందిస్తుందట. భవిష్యత్ లో గుండె వైద్య నిపుణురాలు కావాలని భావిస్తున్నానని తెలిపింది.
మొత్తానికి రౌడీ పిల్ల కేవలం నటిగానే కాదు.. డాక్టర్ గానూ తన వృత్తికి పూర్తి న్యాయం చేయాలన్న తపనతో ఉంది. నేర్చుకున్న విద్యను గాలికొదిలేయడం సరికాదు. పైగా మెరిట్ స్టూడెంట్ కాబట్టి ప్రోత్సహించి తీరాలి. నటన- డ్యాన్సుల్లో దుమ్ము రేపుతోంది. అలానే వైద్యంలోనూ సాయిపల్లవి అదరగొట్టాలని ఆకాంక్షిద్దాం. పరిశ్రమలో ప్రవేశించిన అనతి కాలంలోనే తనదైన నటన- డ్యాన్సులతో కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టిన సాయిపల్లవి యారొగెన్సీ గురించి ఇటీవల ప్రచారమైంది. ఇకపోతే కెరీర్ పూర్తయ్యే లోపు ఇంకెన్ని సంచలనాలకు తావిస్తుందో.. ఇంకెన్ని వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తుందో చూడాలి.
No comments:
Post a Comment