జబర్ధస్థ్ కామెడీ షోతో కమీడియన్ గా సినిమాల్లోకి వచ్చిన షకలక శంకర్ తాజాగా హీరోగా కూడా మారాడు. శంకర్ హీరోగా నూతన దర్శకుడు సత్య దర్శకత్వంలో డ్రైవర్ రాముడు అనే కామెడీ యాక్షన్ సినిమా రెడీ అవుతుంది. సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో యంగ్ బ్యూటీ నవికా కొటియా హీరోయిన్ గా నటిస్తుందని చిత్ర వర్గాలు తెలిపాయి. అత్తారింటికి దారేది సినిమాలో సమంత - ప్రణిత చెల్లెలుగా నటించింది నవికాకోటియా. కమీడియన్ గా బిజీ అవుతున్న టైమ్ లో శంకర్ హీరోగా కూడా తన లక్ టెస్ట్ చేసుకోడానికి డ్రైవర్ రాముడు ని ట్రై చేస్తున్నాడు. గతంలో సునీల్ హీరో లాంఛింగ్ మూవీ అందాలరాముడు స్పూర్తితో ఈ సినిమా తెరకెక్కుతుందని సినీజనాలు అంటున్నారు. శంకర్ కి ప్లస్ పాయింట్ గా నిలిచే స్పూఫ్ లతో ఈ సినిమా ఫుల్ ఎంటర్ టైనింగ్ గా ఉంటుందని వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ సినిమాతో హీరోయిన్ గా మారిన నవికకోటియా గతంలో పలు భారీ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. తమిళంలో కూడా ఈ బ్యూటీ నటించింది. గతేడాది విడుదలైన విజయ్ థేరీ సినిమాలో నవికా ఓ కీలక పాత్ర పోషించింది. అలానే బుల్లితెరలో కూడా నటించిన ఎక్స్ పీరియన్స్ నవికాకు ఉంది. టీవీ నుంచి బిగ్ స్క్రీన్ కి ప్రమోట్ అయిన చాలా మంది అమ్మాయిలు హీరోయిన్లుగా రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో శంకర్ సరసన స్క్రీన్ షేర్ చేసుకుంటూ తొలిసారి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న నవికా కోటియా కెరీర్ ఎలా ఉంటుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.
Read More : Andhra Talkies
Tags : Telugu News, Telugu Cinema News, Telugu Movie News, Telugu Film News, Tollywood News, Tollywood Latest News, Latest Tollywood News, Telugu Movie Reviews, Telugu Cinema Reviews, Tollywood Movie Reviews, Tollywood Film Reviews, Andhra News, Telangana News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

No comments:
Post a Comment