ఆ హీరోయిన్లు దుకాణం సర్దాల్సిందేనా..?
![]() |
ఆ హీరోయిన్లు దుకాణం సర్దాల్సిందేనా..? |
కానీ కొంతమంది హీరోయిన్లు బ్యూటీతో పాటు తమ యాక్టింగ్ కలిపి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వెంటనే స్టార్ డమ్ సొంతం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళు వచ్చిన వరుస అవకాశాలు సద్వినియోగం చేసుకోలేక - పాత్ర కంటే రెమ్యూనరేషన్ కే ఇంపార్టెన్స్ ఇచ్చి ఇండస్ట్రీ నుండి ఫేడ్ అవుట్ అయ్యే పరిస్థితి తెచ్చుకున్నారు. హెబ్బా పటేల్ - శ్రద్ధాదాస్ - ప్రగ్యా జైస్వాల్ - రెజీనా కసాండ్ర - అను ఇమ్మాన్యుయేల్ లాంటి హీరోయిన్లు ఈ కోవకే చెందుతారు. వీరితో పాటు ఇంకా కొంతమంది హీరోయిన్లు ఇప్పుడు టాలీవుడ్ నుండి తమ దుకాణం మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది.
రేపు లాక్ డౌన్ ఎత్తేసాక ప్రొడ్యూసర్స్ వీళ్ళకంటే కొత్త హీరోయిన్లకే ఎక్కువ ప్రిఫరెన్సు ఇచ్చే అవకాశాలున్నాయట. ఎందుకంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న వీరికి భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చి ఖర్చు పెంచుకోవడం కంటే కొత్త హీరోయిన్లతో వెళ్తే ఇబ్బందులు ఉండవని ప్రొడ్యూసర్స్ భావిస్తున్నారట. కొత్త వాళ్ళు అయితే తక్కువ రెమ్యూనరేషన్ లో వస్తారు - అంతేకాకుండా అవనీ ఇవనీ గొంతెమ్మ కోర్కెలు కూడా కోరరని నిర్మాతలు భావిస్తున్నారట. మరి వీళ్ళు వీళ్ళు ఇండస్ట్రీ నుండి దుకాణం సర్దుకుంటారా.. లేక ఏదొక క్యారెక్టర్ అని హెబ్బాపటేల్ లాగా వ్యాంప్ పాత్రలు చేసుకుంటూ వెళ్తారా అనేది చూడాలి.
anthegaa anthegaa.
ReplyDeleteFew telugu movies at Boxoffice under rated
Best dubbed movies in telugu