300 కోట్ల సాహో సినిమాలో ఇలాంటి పాటలా?

No-Buzz-To-Prabhas-Movie-Saaho-Songs-Andhra-Talkies
సాహో మొత్తానికి స్క్రీన్ పైకి వచ్చేసింది. డివైడ్ టాక్ ఖంగారు పెడుతున్నా మూడు రోజులకు అడ్వాన్స్ బుకింగ్ దాదాపుగా పూర్తయ్యింది కాబట్టి సోమవారం నుంచి ఎలాంటి రన్ ఉంటుందనే దాన్ని బట్టి ఫైనల్ స్టేటస్ ఆధారపడి ఉంది. ఇలాంటి రిపోర్ట్ రావడానికి సాహోలో ప్రతికూలాంశాలు చాలా ఉన్నాయి కానీ ముఖ్యంగా సంగీతం గురించిన నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. 300 కోట్ల బడ్జెట్ సినిమాకు సరైన రీతిలో సంగీత దర్శకులను సెట్ చేసుకోకపోవడం ఎంత ఖరీదైన తప్పో ఇవాళ అర్థమవుతోంది.

ఉన్న నాలుగు పాటలూ ఎవరికీ కనెక్ట్ కాలేక కేవలం విజువల్స్ కారణంగా మాత్రమే చూడబుద్ది అవుతున్నాయంటే మ్యూజిక్ విషయంలో సాహో చేసిన బ్లండర్ స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కో ట్యూన్ ఒక్కో సంగీత దర్శకుడు కంపోజ్ చేయడం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం పక్కరాష్ట్రం నుంచి జిబ్రాన్ ను ప్రత్యేకంగా తీసుకోవడం ఇవేవి అంతగా ప్లస్ కాలేకపోయాయి. ఏ ట్యూనూ పది కాలాల పాటు గుర్తుపెట్టుకునేలా లేకపోవడం సాహో మ్యూజిక్ లోని అతి పెద్ద ట్రాజెడీ.


బాహుబలి-వర్షం-మిర్చి - ఛత్రపతి ఇలా డార్లింగ్ కెరీర్ లో మ్యూజికల్ హిట్స్ చాలా ఉన్నాయి. అంతెందుకు ఫ్లాప్స్ గా పేరు తెచ్చుకున్న పౌర్ణమి - ఏక్ నిరంజన్ - యోగి లాంటి వాటిలో సైతం ఇప్పటికీ గుర్తు చేసుకునే సాంగ్స్ ఉన్నాయి. అలా సాహోలో ఒక్కటి కూడా లేకపోవడం ముమ్మాటికీ మేకర్స్ తప్పే. రెండేళ్ల నిర్మాణంలో కేవలం చివరి మూడు నెలలే మ్యూజిక్ డైరెక్టర్స్ ని సెట్ చేసుకోవడం శంకర్ ఎహసాన్ లాయ్ లతో విభేదాలు తెచ్చుకోవడం ఇవన్నీ అవుట్ ఫుట్ మీద చాలా ప్రభావం చూపించాయి. ఒకరకంగా చెప్పాలంటే భారీ చిత్రాల విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదో  సాహో ఓ లెసన్ లా నిలిచింది

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...