జాతీయ అవార్డ్ వెనక అంత లాబీయింగ్ ఉందా?

Big-Gambling-Behind-National-Awards-Andhra-Talkies
66వ జాతీయ అవార్డులు ఇటీవల ప్రకటించిన సంగతి విదితమే. ఈ పురస్కారాల్లో `రంగస్థలం` చిత్రానికి అన్యాయం జరిగిందని.. ముఖ్యంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి ఉత్తమ నటుడు అవార్డు రావాల్సింది కాస్తా లాబీయింగ్ వల్ల బాలీవుడ్ హీరోలకు ఆ ఛాయిస్ వెళ్లిపోయిందని ప్రచారమవుతోంది. అయితే అంతగా లాబీయింగ్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? అంటే బాలీవుడ్ సీనియర్ నటుడు పరేష్ రావల్ ఇదంతా చేశారని తెలుగు సినీమీడియాలో చర్చ సాగుతోంది.

చిట్టిబాబు పాత్రలో చెవిటి కుర్రాడిగా రఫ్ అండ్ రగ్గ్ డ్ లుక్ తో రామ్ చరణ్ గొప్పగా నటించారు. గోదారి యాస కట్టుబాట్లు ఉన్న కుర్రాడిగా అద్భుతంగా నటించి మెప్పించాడు. దాంతో పోలిస్తే బాలీవుడ్ స్టార్లు అంత గొప్పగా ఏం నటించారు.. అంటూ మెగాభిమానుల్లోనూ దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే రామ్ చరణ్ ఎంత చేసినా సీనియర్ నటుడు పరేష్ రావల్ అవార్డు రాకుండా అడ్డుకున్నాడట..!


అలా ఎందుకు చేశాడు? అంటే అతడు విక్కీ కౌశల్ `యూరి`లో కీలక పాత్ర పోషించాడు. కమెండ్ ఆపరేషన్ అధికారిగా నటించారు. విక్కీతో తనకు ఉన్న అనుబంధం దృష్ట్యా అతడికి అవార్డ్ వచ్చేలా చేసాడు అని ముచ్చటించుకుంటున్నారు. మోదీ ప్రభుత్వంతో లాబీయింగ్ చేయగలిగే సమర్థత తనకు ఉంది కాబట్టి చరణ్ కి ఆ పురస్కారం దక్కకుండా చేశాడట. ఈ ప్రచారంలో నిజం ఎంత? అన్నది తెలియాల్సి ఉంది. జాతీయ అవార్డుల జూరీని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. జూరీ తీసుకున్న నిర్ణయమే ఫైనల్. అయితే జూరీ కొందరు ప్రముఖుల సిఫారసుకు ప్రభావితం కాదు అనడానికి ఆధారం లేదు. మరి పరేష్ సిఫారసు అక్కడ పని చేసిందా? అన్నది జాతీయ మీడియానే ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. కానీ అది జరగదు కదా?

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...