వాడ్ని తీసేయ్యండి..లేదంటే సినిమాను బహిష్కరిస్తాం

Twitter-calls-out-Ajay-Devgn-for-working-with-Alok-Nath-in-De-De-Pyaar-De-Movie-Andhra-Talkies
ఒక్కోసారి వివాదాలు ఎటునుంచి వస్తాయో చెప్పలేం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక మూల నుంచి కాండ్రవర్సీలు కాటేస్తూనే ఉంటాయి. అజయ్ దేవగన్ నటించిన దే దే ప్యార్ దే సినిమాకు కూడా ఇప్పుడు అలాంటి వివాదాలే చుట్టుముట్టాయి. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. బాగుంది అని కూడా బాలీవుడ్ అంతటా ప్రచారం ఉంది. రిలీజ్ అయితే సినిమా హిట్ అవుతుంది కూడా బాలీవుడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే.. ఇప్పుడు అలోక్ నాథ్ అనే ఒక నటుడి వల్ల.. సినిమా రిలీజ్ ఆగిపోయే పరిస్థితి వచ్చింది.



వివరాల్లోకి వెళ్తే.. దేదే ప్యార్ దే సినిమాలో కీలక పాత్రలో అలోక్నాథ్ నటించింది. ఈ ఆలోక్ నాథ్ ఎవరో కాదు.. సూరజ్ బర్జాత్యా సినిమాల్లో ఎక్కువుగా కన్పిస్తుంటాడు. అతనిపై మీ టూ ఉద్యమం సమయంలో వింటా నందా అనే రచయిత సంచలన ఆరోపణలు చేసింది. 19 ఏళ్ల క్రితం అతను తనపై అత్యాచారం చేశాడని.. కానీ అతను అప్పుడు అతను పెద్ద నటుడు అని - తన కెరీర్ స్పాయిల్ అవుతుందని చెప్పలేదని ఆరోపణలు చేసింది. ఇప్పుడు మీ టూ ఉద్యమం వల్ల ఈ ప్రపంచానికి అతడి నిజ స్వరూపం తెలియాలని బయటకు వచ్చానని చెప్పింది. దీంతో అతనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అలోక్నాథ్ మెంబర్ షిప్ కూడా సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రద్దు చేశారు. కానీ ఇప్పుడు అతడ్ని దే దే ప్యార్ దే సినిమాలో ఎలా తీసుకుంటారు అంటూ మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీన్నిబట్టి.. అతడ్ని అజయ్ దేవగన్ ఎంకరేజ్ చేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. అయితే.. ఈ విమర్శలపై స్పందించిన అజయ్.. అతనిపై ఆరోపణలు రాకముందు సినిమా షూటింగ్ పూర్తైందని.. ఇప్పుడు తామేమీ చెయ్యలేమని చెప్పుకొచ్చాడు. దీంతో.. అతడు లేకుండా సినిమా రిలీజ్ చెయ్యకపోతే.. సినిమాను బహిష్కరిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి మహిళా సంఘాలు

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...