రంగీలాకు రాము 'హ్యపీ ఉమన్స్ డే'..!

Director-Ram-Gopal-Varma-Womens-Day-Wishes-to-Urmila-Andhra-Talkies
ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు.  ఈ సందర్భాన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తన సినిమాకు ఆయుధం గా వాడుకున్నాడు. మార్చ్ 6 బుధవారం నాడు ఆయన ఇలా ట్వీట్ చేశాడు "లక్ష్మీస్ ఎన్టీఆర్ అనేది ఫస్ట్ ఉమన్ ఓరియెంటెడ్ మెన్స్ ఫిలిం.  హ్యాపీ ఉమెన్స్ డే."  అది రెండ్రోజుల క్రితం.  ఈరోజు 'ఉమెన్స్ డే' సందర్భంగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' రెండో ట్రైలర్ రిలీజ్ చేశారు.

 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ 2.. హంగామా అంతా ప్రొఫెషన్ కోసం ఉమెన్స్ డే సెలబ్రేషన్.  కానీ వ్యక్తిగతంగా ఉమన్స్ డే సెలబ్రేషన్ మరోరకంగా చేశాడు.  తనకు ప్రియమైన హీరోయిన్ అయిన ఊర్మిళ మాతోండ్కర్ కు ట్విట్టర్.. ఇన్స్టా గ్రామ్ ఖాతాల ద్వారా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు.  'రంగీలా' సినిమా ఊర్మిళ పోస్టర్ ను షేర్ చేసి "అందమైన రంగులను చల్లిన మహిళకు..  హ్యాపీ ఉమన్స్ డే" అంటూ ప్రత్యేకంగా విషెస్ తెలిపాడు.



ఊరికే ఉబుసుపోక మాట్లాడే సమయంలోనైనా.. సీరియస్ గా ఇల్లాజికల్లీ టెక్నికల్లీ ఫిలసాఫికల్ మెటాఫిజికల్ భావాలు వెలిబుచ్చే సమయంలోనైనా వర్మ రెండు విషయాల్లో నిక్కచ్చిగా ఒకమాట మీద ఉంటాడు.  మొదటి విషయం.  అతిలోక సుందరి శ్రీదేవి టాపిక్ వచ్చినపుడు.  రెండో విషయం భూలోక సుందరి ఊర్మిళ మాతోండ్కర్ టాపిక్ వచ్చినప్పుడు. ఎందుకు అని మరీ ఆరిందలా అడక్కండి. అసలే మహిళా దినోత్సవం. ఎక్కువ తక్కువ మాట్లాడితే ఆబ్జెక్టిఫికేషన్ అని గట్టిగా తగులుకునేందుకు సంఘాలు రెడీగా ఉంటాయి

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...