అంత వీక్ అయితే సినిమాల్లోకి రావొద్దు | Do not come into the movies if so weekly

do-not-come-into-movies-if-so-weekly

అంత వీక్ అయితే సినిమాల్లోకి రావొద్దు | Do not come into the movies if so weekly

సినీ రంగానికి ఉన్న ఆకర్షణ దృష్ట్యా ఇక్కడ ఒక వెలుగు వెలిగిపోవాలని చాలామంది వస్తుంటారు. కానీ ఆ ప్రయత్నంలో అందరూ విజయవంతం కారు. బయటికి మెరుస్తూ కనిపించే ఈ ఇండస్ట్రీలో.. లోలోన చాలా సమస్యలుంటాయి. సవాళ్లను దాటి తెరపై వెలిగేవాళ్లు చాలా కొద్దిమందే. ఈ ప్రయత్నంలో విఫలమై జీవితాల్ని నాశనం చేసుకునేవాళ్లు చాలామందే ఉంటారు. ఆశించిన స్థాయికి చేరలేక జీవితాన్ని ముగించేవాళ్లు కూడా ఉంటారు. ఈ ఉందంతాలపై  మలయాళ నటి అమలాపాల్ స్పందించింది. సినీ పరిశ్రమలో కొనసాగాలంటే చాలా ధైర్యం కావాలని.. అది లేని వాళ్లు ఈ రంగంలోకి రాకూడదని ఆమె తేల్చిచెప్పింది.


ఫ్యామిలీ సెంటిమెంటుతో కొందరు హీరోయిన్లు మనసు చంపుకుని నటనకు దూరం అవుతున్నారని.. కొందరు ప్రాణాలను తీసుకోవడం వంటి అగత్యాలకు పాల్పడుతున్నారని ఆమె చెప్పింది. బలహీనమైన వారికి సినిమా సెట్ అవ్వదని.. ఈ రంగంలో ఎప్పుడైనా.. ఏమైనా జరగవచ్చునని అమల అంది. మనోధైర్యం కలిగిన వారే ఇక్కడ నిలదొక్కుకోగలరని స్పష్టం చేసింది. అదే సమయంలో సినీ రంగానికే కాక ఏ రంగంలోని మహిళలకైనా ఇది వర్తిస్తుందని ఆమె చెప్పింది. సినిమాలకు సంబంధించి పురుషుల కంటే మహిళలే చాలా సవాళ్లనే ఎదుర్కొనాల్సి ఉంటుందని అమల అభిప్రాయపడింది. కెరీర్ ఆరంభంలో తమిళంలో ఒక బి-గ్రేడ్ సినిమాలో నటించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న అమల.. ఆ తర్వాత రెగ్యులర్ సినిమాల్లో నటిగా తనేంటో రుజువు చేసుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దర్శకుడు విజయ్ ను పెళ్లాడిన రెండేళ్లకే అతడి నుంచి విడిపోయిన అమల.. ఇప్పుడు స్వతంత్రంగా తనకు నచ్చినట్లు జీవిస్తోంది. తమిళంలో ఆమె కెరీర్ బాగానే సాగుతోంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...