హృదయాలను కలిచి వేస్తున్న సుశాంత్ లాస్ట్ పోస్ట్...!

కాగా 2008 నుండి అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై తన హవా చూపించిన సుశాంత్ తన నటనతో డ్యాన్స్ లతో అందరినీ ఆకట్టుకున్నాడు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండేవారు. సుశాంత్ సింగ్ జూన్ 3న ఇంస్టాగ్రామ్ లో చివరి పోస్ట్ పెట్టారు.
2002లో మరణించిన తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఒక కవితాత్మక పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు ఆ పోస్టు చూసి అందరి హృదయాలు బరువెక్కుతున్నాయి. ''మసకబారిన గతం కన్నీరుగా జారి ఆవిరవుతోంది. అనంతమైన కలలు చిరునవ్వును.. అశాశ్వతమైన జీవితాన్ని చెక్కుతున్నాయి. ఆ రెండింటి మధ్యా బతుకుతున్నా'' అని సుశాంత్ తన తల్లి ఫోటో షేర్ చేసారు. అప్పుడు సుశాంత్ సింగ్ తన తల్లిని గుర్తు చేసుకుంటూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు అందరినీ భావోద్వేగానికి గురి చేస్తోంది.
No comments:
Post a Comment