డిసెంబర్ 21 - అంతా కొత్త సినిమాల మోత! | December 21 - All the new movies!

21-december-21-all-new-movies-andhra-talkies
December 21 - All the new movies!
ఒకే రోజు రెండు మూడు సినిమాలు విడుదల కావడం చాలా సాధారణం అయిపోయింది. వసూళ్ల పరంగా ఒకదాని మీద మరొకటి ప్రభావం చూపిస్తుందని తెలిసినా కూడా నిర్మాతలకు వేరే ఆప్షన్ ఉండటం లేదు. ఇప్పుడు వదిలేస్తే మరో వారానికి పోటీ పెరగడమో లేదా హాలిడే సీజన్ ని మిస్ కావడమో జరుగుతుంది. అందుకే సై అంటే సై అంటూ బరిలో దూకుతున్న వాళ్లే ఎక్కువ. ఈ నేపథ్యంలో వచ్చే డిసెంబర్ 21 అన్ని క్రేజే సినిమాలతో చాలా హాట్ గా మారేలా ఉంది.

శర్వానంద్-సాయి పల్లవి కాంబోలో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పడి పడి లేచే మనసు మీద ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. వరుణ్ తేజ్ హీరోగా ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి రూపొందించిన మొదటి టాలీవుడ్ స్పేస్ థ్రిల్లర్ అంతరిక్షం కూడా అదే డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇదే హోరా హోరి అనుకుంటే కన్నడ స్టార్ యష్ హీరోగా రూపొందిన శాండల్ వుడ్ మోస్ట్ కాస్ట్లీ మూవీ కేజీఎఫ్ కూడా రంగం సిద్ధం చేసుకుంటోంది. యష్ కి ఇక్కడ ఇమేజ్ లేకపోయినా కోలార్ బంగారు గనుల నేర సామ్రాజ్యం బ్యాక్ డ్రాప్ ఇక్కడి ప్రేక్షకులకు సైతం ఆకట్టుకుంటోంది. టాక్ పాజిటివ్ గా ఉంటే పోటీ  టఫ్ గానే ఉంటుంది.



ఇవన్నీ ఒక ఎత్తు అయితే బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా అనుష్క శర్మ-కత్రినా కైఫ్ హీరోయిన్లుగా రూపొందిన జీరో కూడా వార్ ఫీల్డ్ లో ఉంది. ఇక్కడి బిసి సెంటర్స్ లో పెద్దగా ప్రభావం ఉండదు కానీ హైదరాబాద్ తో పాటు జిల్లా ప్రధాన కేంద్రాల మల్టీప్లెక్సుల్లో షారుఖ్ సినిమా ఎక్కువ స్క్రీన్లు ఆక్రమించుకునే అవకాశం ఉంది. రెండు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన జీరోలో షారుఖ్ మఱుగుజ్జుగా నటించడం వల్ల ట్రైలర్ విపరీతంగా వైరల్ అయిపోయి అంచనాలు పెంచేసింది. ఇలా దేనికవే క్రేజీ మూవీస్ కావడంతో ఓపెనింగ్స్ ని పంచుకోవడం తప్పదు.

టాక్ బాగున్న సినిమాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా ఏ మాత్రం తేడా వచ్చినా ప్రేక్షకులకు మంచి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆటోమాటిక్ గా షిఫ్ట్ అయిపోతారు. ఏది మిస్ కాకూడదు అనుకునే సినిమా ప్రియులకు మాత్రం పర్సులో చమురు భారీగ్గా వదులుతుంది. పరిస్థితి చూస్తుంటే ఎవరు వెనక్కు తగ్గడం ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపించడం లేదు. ఏదైనా మార్పులు ఉన్నా ఇంకో వారం పది రోజులు ఆగితే కానీ క్లారిటీ రాదు

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...