సైరా వార్.. 50కోట్లు ఖర్చు పచ్చి అబద్ధమా?

Rumours-on-About-megastar-chirajeevi-movie-Sye-Raa-Movie-Budget-Andhra-Talkies.jpg

సైరా వార్.. 50కోట్లు ఖర్చు పచ్చి అబద్ధమా?

సైరా` చిత్రానికి అన్ లిమిటెడ్ బడ్జెట్ ఖర్చు చేస్తున్నామని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ అధినేత రామ్ చరణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ఈ సినిమాకి దాదాపు 200 కోట్ల మేర ఖర్చు చేస్తున్నారని - కేవలం వార్ సన్నివేశాలకే రూ.50 కోట్లు వెచ్చించారన్న ప్రచారం సాగింది. అయితే ఇటీవల సామాజిక మాధ్యమాల్లో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఒక్కొక్కరూ ఒక్కో తరహాలో ప్రచారం చేస్తుండడంతో అందరిలో ఒకటే కన్ఫ్యూజన్ నెలకొంది.

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విరోచిత పోరాటాల్ని ఇండియన్ సినిమా హిస్టరీలో మునుపెన్నడూ చూడని తీరుగా బెస్ట్ వార్ ఎపిసోడ్స్ చూపించాలన్న ప్లాన్ అయితే ఉంది. ఆ క్రమంలోనే జార్జియాకు వెళ్లింది సైరా యూనిట్. అక్కడ ఏకంగా 50కోట్లు ఖర్చు చేస్తూ భారీ పోరాట సన్నివేశాల్ని తీస్తున్నారన్న ప్రచారం తొలుత సాగింది. అయితే ఇందులో ఏమాత్రం వాస్తవం లేదన్నది ఒక కొత్త వాదన తెరపైకొచ్చింది. కేవలం వార్ ఎపిసోడ్స్ కు ఖర్చు చేసేది 50 కోట్లు అనుకుంటే - ఇందులో క్లైమాక్స్ కలుపుకుని సినిమా మొత్తంలో నాలుగు వార్ ఎపిసోడ్స్ వస్తాయిట. ప్రథమార్థంలో రెండు ద్వితీయార్థంలో రెండు భారీ వార్ సీక్వెన్సులు ఉంటాయని తెలుస్తోంది. వీటన్నిటికీ కలిపి 50కోట్ల బడ్జెట్ అని ఒక వాదన వినిపిస్తోంది. ఇక 200కోట్ల బడ్జెట్ లో మెగాస్టార్ పారితోషికం 30కోట్లు - యాక్షన్ ఎపిసోడ్స్ 50 కోట్లు మినహాయిస్తే 120 కోట్ల మేర సినిమా మొత్తానికి ఖర్చవుతుందని చెబుతున్నారు.

ఇక జార్జియాలో జరిగే చిత్రీకరణకు సెటప్ మొత్తం రెడీగా ఉంటుంది కాబట్టి కేవలం రూ.10కోట్లలోనే సరిపుచ్చుతారన్న వాదనా వినిపిస్తోంది. ఇదివరకూ జార్జియాలో తెరకెక్కించిన `గౌతమి పుత్ర శాతకర్ణి` చిత్రానికి ఇదే తరహాలో ఖర్చయింది. ఇప్పుడు సైరాకు అంతే ఖర్చవుతుందని చెబుతున్నారు. ఇక సినిమాకి సంబంధించి కీలక ఎపిసోడ్స్ అన్నీ జార్జియాలో తెరకెక్కిస్తున్నారు. అయితే వేరొక కోణం పరిశీలిస్తే.. ఇల్లు అలకగానే సంబరం కాదు.. ఇలా వార్ ఎపిసోడ్స్ తీసిన తర్వాత వాటిని వీఎఫ్ ఎక్స్ - గ్రాఫిక్స్ ని అద్దే క్రమంలో బోలెడంత తతంగం ఉంటుంది. టెక్నికల్ గా చేసే ఖర్చు తక్కువేమీ ఉండదన్న వాదన వేరొక వైపు వినిపిస్తోంది. అందుకే రూ.50కోట్ల బడ్జెట్ ప్రచారంలోకి తెచ్చారా? అన్న సందేహాలు నెలకొన్నాయి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...