
అలాంటి వారిలో మెగా స్టార్ రామ్ చరణ్ ఒకరు. ఈ మధ్య ఈ హీరో అభిమానులను తెగ కలుసుకుంటున్నాడు. రంగస్థలం సెట్స్ కి ఎంత మంది వచ్చినా సరే బ్రేక్ తీసుకొని మరి కలుస్తున్నాడు. తన చిన్నాన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తండ్రి మెగా స్టార్ చిరు కూడా ఎవరు కలవడానికి వచ్చినా నో అనకుండా కలుస్తుంటారు. అభిమానులకు రెస్పెక్ట్ ఇవ్వడంలో పవర్ స్టార్ మంచితనమే వేరు. ఇక అదే హైబ్రిడ్ క్వాలిటీతో వచ్చాడు రామ్ చరణ్. మంచితనంలో మనోడు కూడా సుపర్బ్ అనిపించుకుంటున్నాడు.
డబ్బు అలాగే ఎవరికన్నా వైద్యానికి సంబంధించిన సహాయల్లో కూడా తండ్రి బాబాయి బాటలో నడుస్తున్నాడు. అప్పట్లో కోనసీమలో రంగస్థలం షూటింగ్ లో ఉండగానే చెర్రీ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరు చిన్నారులకు సొంత ఖర్చులతో వైద్యం చేయించాడు. అప్పటి నుంచి చరణ్ పై అందరికి ఎక్కువ ఇష్టం ఏర్పడింది. ఇక రీసెంట్ గా రాజమండ్రిలో షూటింగ్ మొదలవ్వడంతో మరికొంత మంది అభిమానులను కూడా ఈ మెగా హీరో కలిశాడు. ఇక రంగస్థలం షూటింగ్ దాదాపు ఎండింగ్ కి వచ్చేసింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
Ramcharan is a hybrid piece
dear sir very good blog and ramcharan is the tollywood best actor
ReplyDeleteLatest Telugu News