మరో సినిమాపై వివాదం

Hindu-outfit-protests-against-Bengali-film-for-naming-characters-Ram--Sita
సినిమాలు వివాదాల్లో చిక్కుకోవడం ఇటీవల సాధారణమైపోయింది. అసలు... వివాదాస్పందగా సినిమా తీయడం కూడా ఒక స్ర్టాటజీయా అన్న వాదానా వినిపిస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా ఈ వివాదాస్పద సినిమాల జాబితాలో మరో మూవీ కూడా చేరింది.  తాజాగా ఓ బెంగాలీ చిత్రం వివాదంలో చిక్కుకుంది. అందులో ప్రధాన పాత్రధారుల పేర్లు రామ - సీత అని ఉండడమే దీనికి కారణం.
   
హిందూ జాగరణ మంచ్ ఈ చిత్రంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సెన్సార్ కార్యాలయం ముందు నిరసనకు దిగింది. సినిమాలో ప్రధాన పాత్రధారుల పేర్లు మార్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.  దీనిపై హిందూ జాగరణ్ మంచ్ కేంద్ర సమాచార ప్రసార శాఖా మంత్రి స్మృతి ఇరానీకి  లేఖ కూడా రాసింది. రాముడు - సీత పేర్లు పెట్టడం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని ఆ లేఖలో  రాశారు.
   
మరోవైపు కోర్టును సంప్రదించేందుకు కూడా హిందూ జాగరణ్ మంచ్ సిద్ధమవుతోంది. సెన్సార్ బోర్డ్ తమ డిమాండ్లను పట్టించుకోకుంటే న్యాయపోరాటానికి దిగుతామని  హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్ బిజెపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కూడా హిందూ జాగరణ్ మంచ్ సభ్యులకు మద్దతు పలుకుతున్నారు. పురాణ పురుషుల పేర్లను సినిమాల్లో వాడుకోవడం హిందువుల మనోభావాలను కించపరిచినట్లేనంటున్నారు. అయితే... సినిమా దర్శకుడు రజన్ ఘోష్ మాత్రం సమాజంలో చాలా మంది పేర్లు రాముడు - సీత అని ఉన్నపుడు సినిమాలో ఉంటే తప్పేంటని తన వాదన వినిపిస్తున్నారు. కాగా రోంగ్ బెరంగేర్ కోర్ పేరుతో తీస్తున్న ఈ సినిమాలో చిరంజీత్ చక్రవర్తి రీతూ పర్ణా సేన్ గుప్తా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...