 |
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘మర్డర్’ సినిమాపై తీర్పు వాయిదా |
మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య నేపథ్యంలో
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘మర్డర్’ పేరుతో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.
అయితే తన జీవితంపై సినిమా చేస్తున్న నిర్మాతలకు ప్రణయ్ భార్య అమృత గతంలోనే కోర్టు ద్వారా నోటీసులు పంపింది. అనుమతులు లేకుండా తన కథ ఆధారంగా సినిమా తీస్తున్నారంటూ ఆమె నల్లగొండ జిల్లా కోర్టులో పిటీషన్ వేశారు. మర్డర్ సినిమా విడుదల ఆపాలని.. పబ్లిసిటీ ఆపమని కోరుతూ కోర్టును అమృత కోరారు. ఈ మేరకు కోర్టు ద్వారా మర్డర్ సినిమా నిర్మాతలు నట్టి క్రాంతి నట్టి కరుణలకు నోటీసులు పంపారు.
ఈనెల 6న నిర్మాతలు కోర్టుకు హాజరై వారి వాదనను తెలుపాలని కోర్టు నోటీసుల్లో పేర్కొంది. ‘మర్డర్’ సినిమా ట్రైలర్ ను ఇప్పటికే వర్మ విడుదల చేయగా.. అది వైరల్ అయ్యింది. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు వర్మ ప్లాన్ చేయగా అమృత కోర్టుకు వెళ్లి అడ్డుకుంటోంది.